Trivikram Venkatesh: మీరు ఊహించని డైరెక్షన్‌లో ఉంటుంది- 7, 8 పాటలు బీజీఎమ్‌లో ఉంటాయి: త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెంట్స్
Trivikram Venkatesh Speech Aadarsha Kutumbam Trailer Launch: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఫ్యామిలీ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆదర్శ కుటుంబం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్‌లో త్రివిక్రమ్, వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Trivikram Venkatesh Speech Aadarsha Kutumbam Trailer Launch: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్
ఇప్పటికే విడుదలైన టీజర్, నారాయణమ్మ, మాలా పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆదర్శ కుటుంబం ట్రైలర్‌ను అక్టోబర్ 23న రాత్రి విడుదల చేశారు. ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ కళాశాలలో ఘనంగా జరిగింది.
ట్రైలర్ నచ్చిందని ఆశిస్తున్నా
ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. "మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్‌లో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అద్భుతమైన స్పందన చూసి ఆనందంగా ఉంది" అని అన్నారు.
కాలేజ్ అంటే డిగ్రీ, జాబ్ మాత్రమే కాదు
"కాలేజ్ లైఫ్‌లో నాకు ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. ఈరోజులు మళ్లీ రావు. మీరు కూడా మంచి మెమోరీస్ ఉండేలా చూసుకోండి. మీ కలను నిజం చేసుకోండి. కాలేజ్ అంటే డిగ్రీ, జాబ్ మాత్రమే కాదు.. మంచి క్యారెక్టర్‌తో బయటకు రావాలి. అక్టోబర్ 30న మా సినిమా విడుదలవుతోంది. మీ అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను" అని వెంకటేష్ కోరారు.
క్రైమ్ కామెడీ లేదా బ్లాక్ కామెడీ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఈ సినిమా మీరు ఊహించిన పద్ధతిలో కాకుండా, వేరే డైరెక్షన్‌లో ఉండే అవకాశముంది. నార్మల్ రొమాంటిక్ కామెడీ కాకుండా వేరే వేరే అంశాలను కూడా డిస్కస్ చేయడం జరిగింది. క్రైమ్ కామెడీ లేదా బ్లాక్ కామెడీ అలాంటివి ట్రై చేశాము" అని పేర్కొన్నారు.
ఇది ఫస్ట్ అటెంప్ట్
"నాకు, వెంకటేష్ గారికి కూడా ఇది ఫస్ట్ అటెంప్ట్. పని చేసేటప్పుడు ఈ సినిమా మా అందరికీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మీక్కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అక్టోబర్ 30వ తారీఖున థియేటర్లలో కలుద్దాం. ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్లకు, నటీనటులకు, ముఖ్యంగా వెంకటేష్ గారికి కృతజ్ఞతలు" అని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు.
7, 8 పాటలు బీజీఎమ్‌ల
"ప్రొడ్యూసర్ చినబాబు గారికి థ్యాంక్స్ చెప్పుకోవడమంటే ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పుకోవడమే. ఆయన తరఫున కూడా అందరికీ నేనే కృతజ్ఞతలు చెబుతున్నాను. అలాగే తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫెంటాస్టిక్ జాబ్ చేశాడు. దాదాపు 7-8 పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో ఉంటాయి. త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం అవన్నీ. థ్యాంక్యూ. నమస్కారం" అని త్రివిక్రమ్ చెప్పారు.
క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో
ఇకపోతే అద్భుతమైన ట్రైలర్‌తో ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో కూడిన పూర్తిస్థాయి వినోదం అందించనుందనే అంచనాలతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
ఆదర్శ కుటుంబం నటీనటులు
దీపావళి వారాంతానికి ముందు అక్టోబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకటేష్, శ్రీనిధి శెట్టితోపాటు నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


