ఇందుగలడు అందుగలడు అన్నట్టుగా అన్నీ తానై చూసుకున్నాడు.. హీరోపై నటుడు రావు రమేష్ ప్రశంసలు

నటుడిగా రావు రమేష్ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్న ఆయన తాజాగా నటించిన తెలుగు మూవీ అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజు థ్యాంక్యూ మీట్‌లో రావు రమేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Jan 18, 2026, 12:49:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటుడిగా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు రావు రమేష్. ఎన్నో సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ తెలుగు ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు. అలాంటి రావు రమేష్ తాజాగా నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా అనగనగా ఒక రాజు.

ఇందుగలడు అందుగలడు అన్నట్టుగా అన్నీ తానై చూసుకున్నాడు.. హీరోపై నటుడు రావు రమేష్ ప్రశంసలు
ఇందుగలడు అందుగలడు అన్నట్టుగా అన్నీ తానై చూసుకున్నాడు.. హీరోపై నటుడు రావు రమేష్ ప్రశంసలు

డైరెక్టర్‌గా పరిచయం

నవీన్ పోలిశెట్టి, బ్యూటిపుల్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా జంటగా నటించిన సినిమానే అనగనగా ఒక రాజు. మారి డైరెక్టర్‌గా పరిచయం అయిన ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు.

హీరోపై ప్రశంసలు

సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన అనగనగా ఒక రాజు సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా అనగనగా ఒక రాజు థ్యాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నటుడు రావు రమేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హీరోపై ప్రశంసలు కురిపించారు.

ఆనందనాన్ని పంచిన

ప్రముఖ నటుడు రావు రమేష్ మాట్లాడుతూ.. "అనగనగా ఒక రాజు సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి, ఈ సంక్రాంతికి మాకు ఆనందాన్ని పంచిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. దర్శకుడిగా మొదటి విజయాన్ని అందుకున్న మారి గారికి శుభాకాంక్షలు" అని అన్నారు.

తన భుజాలపై మోశాడు

"నవీన్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్. ఇందుగలడు అందుగలడు అన్నట్టుగా అన్నీ తానై చూసుకొని, ఈ సినిమాని తన భుజాలపై మోశాడు. ఎన్నో భారీ విజయాలను అందించిన సితార సంస్థ నిర్మించిన ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది" అని నటుడు రావు రమేష్ తెలిపారు.

అద్భుతమైన స్పందన

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అందరూ మమ్మల్ని ప్రశంసిస్తున్నారు" అని చెప్పుకొచ్చారు.

ప్రతి ఒక్కరి కృషి వల్లే

"టీమ్‌లోని ప్రతి ఒక్కరి కృషి వల్లనే ఇది సాధ్యమైంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. నాకు ఈ సినిమా ప్రత్యేకమైనది. నన్ను ఇందులో భాగం చేసిన నాగవంశీ గారికి, నవీన్ గారికి కృతఙ్ఞతలు" అని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.

ఆ కష్టమే విజయానికి కారణం

రచయిత్రి, క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి మాట్లాడుతూ.. "మా కష్టాన్ని గుర్తించి, మాకు ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. కష్టపడితేనే విజయం వస్తుంది. కష్టపడకుండా విజయం రాదు. అదే ఈ చిత్ర కథ ద్వారా చెప్పాము. ఈ సినిమా కోసం మేమందరం ఎంతో కష్టపడ్డాను. ఆ కష్టమే ఇంతటి విజయానికి కారణమైంది" అని అన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More