OTT Horror: ఓటీటీలోకి వణికించే హారర్ థ్రిల్లర్.. కాల్ చేస్తే నరకమే.. అయిదేళ్ల తర్వాత స్ట్రీమింగ్.. ఊపేసే సస్పెన్స్
OTT Horror: ఇవాళ ఓటీటీలోకి వణికించే హారర్ థ్రిల్లర్ మూవీ ఒకటి వచ్చేసింది. సస్పెన్స్ తో ఊపేసే ఈ మూవీ వెన్నులో వణుకు పుట్టిస్తుందనే కామెంట్లు వస్తున్నాయి.
OTT Horror: వీకెండ్ స్పెషల్ గా ఇవాళ ఓటీటీలోకి ఓ హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. ఇది మామూలు హారర్ థ్రిల్లర్ కాదు.. వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో భయపెట్టే సినిమా ఇది. అదే.. ‘ది కాల్’ మూవీ. ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ శనివారం (ఏప్రిల్ 11) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ది కాల్ ఓటీటీ
అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ ది కాల్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇవాళ నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీలో కూడా ది కాల్ మూవీ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ హారర్ థ్రిల్లర్ ను ఎంజాయ్ చేయొచ్చు.
అయిదేళ్ల తర్వాత
ది కాల్ మూవీ అయిదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా 2020 అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజైంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి టిమోతీ వుడ్ వర్డ్ జూనియర్ డైరెక్టర్. ఈ సినిమాలో లిన్ షేయ్, టాబిన్ బెల్, రషింగ్ తదితరులు నటించారు.
ఇప్పుడు అయిదేళ్ల తర్వాత ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ది కాల్ మూవీ వచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రం డిజిటల్ డెబ్యూ చేసింది.
ది కాల్ మూవీ స్టోరీ
ది కాల్ మూవీని హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఓ చిన్న టౌన్ లో ఎడిత్ క్రాన్స్ టన్ టీచర్ గా పనిచేసి రిటైర్ అవుతుంది. అయితే ఆమె మాంత్రికురాలు అని ఊర్లోని పిల్లలు అనుకుంటారు. ఆమె ఇంటిపై రాళ్లతో దాడి చేసి వేధిస్తుంటారు.
క్రిస్, టోంకా, బ్రూనో, జాక్ అనే నలుగురు ఫ్రెండ్స్ అయితే ఎడిత్ ను దారుణంగా వేధిస్తారు. దీంతో ఎడిత్ సూసైడ్ చేసుకుంటుంది. అప్పుడే ఎడిత్ భర్త ఎడ్వర్డ్ ఆ నలుగురిని తన ఇంటికి రమ్మంటాడు.
కాల్ మాట్లాడాలని
ఎడిత్ చనిపోయే ముందు ఓ వీలునామా రాసిందని, ఓ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే భారీగా డబ్బు ఇస్తానని ఎడ్వర్డ్ ఆశపెడతాడు. ఇంటి పై అంతస్తులో ఉన్న పాత ఫోన్ బూత్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఓ నంబర్ కు కాల్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 60 సెకన్ల పాటు కాల్ కట్ చేయకుండా ఉండాలి.
ఆ నలుగురు ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా ఆ బూత్ లోకి వెళ్తారు. కానీ కాల్ చేయగానే అవతలి నుంచి ఎడిత్ మాట్లాడుతుంది. అప్పుడు కాల్ చేసిన వాళ్లు ఒక మాయ ప్రపంచంలోకి వెళ్తారు. ఎడిత్ వాళ్లను చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఎడిత్ నిజంగానే చనిపోయిందా? అసలు ఆ కాల్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటీ? అన్నది ది కాల్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


