సమంత భర్త డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్.. వారంలోనే 7 మిలియన్ల వ్యూస్.. ఓటీటీలో దుమ్ము రేపుతున్న స్పై థ్రిల్లర్ మూడో సీజన్

సమంత భర్త రాజ్ నిడిమోరు డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఓటీటీలో దుమ్ము రేపుతోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ గత వారం అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Dec 1, 2025, 21:31:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్ దూసుకెళ్తూనే ఉంది. సమంత భర్త రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే కలిసి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు గత వారం అంటే నవంబర్ 24 నుంచి 30 మధ్య 7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

సమంత భర్త డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్.. వారంలోనే 7 మిలియన్ల వ్యూస్.. ఓటీటీలో దుమ్ము రేపుతున్న స్పై థ్రిల్లర్ మూడో సీజన్
సమంత భర్త డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్.. వారంలోనే 7 మిలియన్ల వ్యూస్.. ఓటీటీలో దుమ్ము రేపుతున్న స్పై థ్రిల్లర్ మూడో సీజన్

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 దూకుడు

ఆర్మాక్స్ మీడియా ప్రతి వారం ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్ లిస్టును రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నవంబర్ 24 నుంచి 30తో ముగిసిన వారానికి సంబంధించి కూడా ఈ లిస్టు తీసుకొచ్చింది. ఇందులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 తొలి స్థానంలో నిలిచింది.

దీనికి గత వారం 7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. నాలుగేళ్లుగా ఈ కొత్త సీజన్ కోసం ఎదురు చూసిన అభిమానులు.. నవంబర్ 21న స్ట్రీమింగ్ ప్రారంభం కాగానే ఎగబడి చూస్తున్నారు. దీంతో రెండు వారాలుగా ఇది తొలి స్థానంలోనే ఉంటోంది. మనోజ్ బాజ్‌పాయీ, ప్రియమణి నటించిన సిరీస్ ఇది.

టాప్ 5లోని మిగిలిన వెబ్ సిరీస్ ఇవే

ఇక టాప్ 5లో రెండో స్థానంలో ఉన్న వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. గత శుక్రవారం (నవంబర్ 28) తొలి నాలుగు ఎపిసోడ్లు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు 3.5 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. మూడో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 ఉంది. దీనికి 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

నాలుగో స్థానంలో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోకి వచ్చిన కో-ఎడ్ అనే వెబ్ సిరీస్ ఉంది. ఈ సిరీస్ కు గత వారం 2.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. దీనికి ఫ్రీగానే చూడొచ్చు. ఐదో స్థానంలో జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న జిద్దీ ఇష్క్ ఉంది. ఈ సిరీస్ కు 1.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More