మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3-సిరీస్ వర్కౌట్ కాదన్న ఇంటర్నేషనల్ డైరెక్టర్-రాజ్ నిడిమోరు కామెంట్
ఇండియాలో మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ల్లో ది ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. చాలా గ్యాప్ తర్వాత ఈ సిరీస్ లో కొత్త సీజన్ వస్తుంది. సీజన్ 3 మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సిరీస్ వర్కౌట్ కాదని ఓ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అన్నట్లు రాజ్ నిడిమోరు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
పాపులర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ నుంచి కొత్త సీజన్ వచ్చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 శుక్రవారం (నవంబర్ 21) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గత ఆరు సంవత్సరాలుగా 'ది ఫ్యామిలీ మ్యాన్' భారతీయ పాప్ సంస్కృతిలో ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సిరీస్ అత్యంత విజయవంతమైన, ప్రజాదరణ పొందిన ఇండియన్ వెబ్ సిరీస్‌లలో ఒకటి. ఇప్పుడు సీజన్ 3 స్ట్రీమింగ్ సందర్భంగా క్రియేటర్లలో ఒకరైన రాజ్ నిడిమోరు సిరీస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

స్పై థ్రిల్లర్ తో పాటు కామెడీ
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఓ స్పై థ్రిల్లర్. అంతే కాకుండా ఇందులో కామెడీ కూడా ఉంది. అయితే ఈ రెండింటిని మిక్స్ చేస్తే సిరీస్ వర్కౌట్ కాదని ఓ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చెప్పాడని రాజ్ నిడిమోరు వెల్లడించాడు. రాజ్ అండ్ డీకే కలిసి ఈ సిరీస్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఫస్ట్ రెండు సీజన్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
వర్కౌట్ కాదని
అమెరికా నుండి వచ్చిన ఒక దర్శకుడు ది ఫ్యామిలీ మ్యాన్ స్క్రిప్ట్ చూసి వర్కౌట్ కాదని చెప్పాడని రాజ్ నిడిమోరు తెలిపాడు. ‘‘ఒక ఇంటర్నేషనల్ దర్శకుడు థ్రిల్లర్‌ను కామెడీతో కలపడం సాధ్యం కాదన్నాడు. ‘మీరు రెండు జానర్‌లను ఇలా కలపలేరు. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన గూఢచారి సిరీస్ లేదా మరొకటి లేదు’ అని అన్నాడు. అవి సాధారణంగా యాక్షన్, డ్రామా లేదా క్రైమ్ జానర్‌లో ఉంటాయి. ఈ జానర్‌లో కామెడీ ఉండదు. కామెడీ ఉన్నప్పుడు అది వ్యంగ్యంగా మారుతుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ముఖ్యమనిపించింది’’ అని రాజ్ పేర్కొన్నాడు.
కొన్ని సీన్లు కట్
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఓటీటీలో మరీ కామెడీగా మారకుండా ఉండేందుకు కొన్ని సీన్లు కట్ చేశామని రాజ్ నిడిమోరు తెలిపాడు. “మేము నిజంగా కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను కత్తిరించాము. ఎడిటింగ్‌లో వాటిని తొలగించాల్సి వచ్చింది. ఎందుకంటే కొన్నిసార్లు అవి చాలా హాస్యాస్పదంగా ఉండేవి. ఆ సందర్భంలో అది అర్థం కాలేదు” అని అతను చెప్పాడు.
నార్త్ ఈస్ట్ లో
ది ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్‌లో హీరో శ్రీకాంత్ తివారీ కశ్మీర్ కు వెళ్తాడు. రెండో సీజన్ లో కథ కాస్త చెన్నైలో సాగుతుంది. శ్రీలంకలోని తమిళ ఈలం ఉద్యమాన్ని చర్చించింది. అయితే సీజన్ 3 నార్త్ ఈస్ట్ ఇండియాకు మారింది. ఈ ఎంపిక గురించి రాజ్ ఇలా అన్నాడు.
“కశ్మీర్, తరువాత చెన్నైపై దృష్టి సారించిన తర్వాత ఇది నేచురల్ డెవలప్ మెంట్. మేము ఒక సీజన్ ముందుగానే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు. ఈ ప్రాంతాలపై వెలుగు ప్రసరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలోని ఇతర అన్ని ప్రాంతాలలో మేము అనేక కథలను సెట్ చేశాం. ఈశాన్య భారతం తక్కువగా కనిపించేది’’ అని రాజ్ తెలిపాడు.
ది ఫ్యామిలీ మ్యాన్ ఓటీటీ
ది ఫ్యామిలీ మ్యాన్ లో మనోజ్ బాజ్‌పేయ్ టైటిల్ పాత్ర పోషించాడు. షరీబ్ హష్మీ, ప్రియమణి, శ్రేయా ధన్వంతరి, గుల్ పనాగ్, అశ్లేష ఠాకూర్, వేదాంత్ సిన్హా తదితరులు నటించారు. సీజన్ 3లో నిమ్రత్ కౌర్‌తో పాటు జైదీప్ అల్లావత్ విలన్లుగా పరిచయం అవుతున్నారు. ఇది నవంబర్ 21న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


