ఇవాళ ఓటీటీలోకి విజయ్ సేతుపతి కొడుకు సిరీస్.. ఏడు భాషల్లో తమిళ స్పోర్ట్స్ డ్రామా

తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి తనయుడు సూర్య విజయ్ సేతుపతి వెబ్ సిరీస్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ తమిళం సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.  

Published on: Nov 20, 2025, 06:02:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళం నుంచి మరో వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. అదే ‘నాడు సెంటర్’ సిరీస్. ఇందులో తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి వారసుడు సూర్య విజయ్ సేతుపతి కీ రోల్ ప్లే చేశాడు. ఇది బాస్కెట్ బాల్ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామా సిరీస్ గా తెరకెక్కింది. ఇవాళ (నవంబర్ 20) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సిరీస్.

ఓటీటీలో తమిళ వెబ్ సిరీస్ (x/JioHotstartam)
ఓటీటీలో తమిళ వెబ్ సిరీస్ (x/JioHotstartam)

నాడు సెంటర్ ఓటీటీ

తమిళ వెబ్ సిరీస్ ‘నాడు సెంటర్’ ఓటీటీలోకి వచ్చేసింది. జియోహాట్‌స్టార్‌ స్పెషల్ సిరీస్ గా తెరకెక్కిన ఇది గురువారం నుంచి అదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాళీ, మరాఠీ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

యూత్ ఆడియన్స్

పాఠశాలలో ఉండే టీనేజీ అల్లరి, గొడవలు, లవ్ అనే అంశాలు చుట్టూ సాగే సిరీస్ నాడు సెంటర్. ఇందులో బాస్కెట్ బాల్ ను బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నారు. ఈ సిరీస్ లో సూర్య ఎస్కే, రెజీనా, జీవా సుబ్రమణియన్, శశికుమార్, సూర్య విజయ్ సేతుపతి తదితరులు నటించారు. దీనికి నారు నారాయణన్ డైరెక్టర్.

నాడు సెంటర్ కథ

టీనేజీ లైఫ్ ను బాస్కెట్ బాల్ తో ముడిపెట్టి చూపించే సిరీస్ నాడు సెంటర్. ఓ పాఠశాలలోని స్టూడెంట్స్ చాలా టఫ్ గా ఉంటారు. అన్ని చెడు అలవాట్లు, గొడవలతో రచ్చ చేస్తుంటారు. మధ్యలో టీనేజీ లవ్ కూడా ఉంటుంది. వీళ్లను దారిలోకి తెచ్చేందుకు, స్కూల్ పరువు కాపాడేందుకు బాస్కెట్ బాల్ టీమ్ రెడీ చేయాలని మేనేజ్ మెంట్ అనుకుంటుంది.

స్కూల్ స్టూడెంట్స్ తో కలిపి ఓ బాస్కెట్ బాల్ టీమ్ తయారు చేస్తారు. ఆటతో వాళ్లలో డిసిప్లేన్ వస్తుంది. అంతే కాకుండా తమల్ని తాము నిరూపించుకోవాలనే కసి మొదలవుతుంది. మరి టీమ్ తయారు చేసుకున్నాక ఏం జరిగింది? గొడవలన్నీ పక్కన పెట్టి జట్టును గెలిపించారా? కోచ్ కథ ఏంటీ? అన్నది సిరీస్ లో చూడాల్సిందే.

ఎందుకు చూడాలంటే?

ఓటీటీలోకి చాలా సిరీస్ లు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. కొత్త కంటెంట్ ను ఆడియన్స్ ఎప్పుడూ ప్రొత్సహిస్తూనే వస్తున్నారు. నాడు సెంటర్ కూడా ఇలా కొత్త కంటెంట్ తో వచ్చిందే. యూత్, తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అవుతుంది ఈ సిరీస్. ఇది ఎమోషనల్, స్పోర్ట్స్ డ్రామా, కమింగ్ ఏజ్ కథాంశాలతో వచ్చిన సిరీస్. స్పోర్ట్స్ తో కుర్రాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయని చెప్పడం ప్రధాన ఉద్దేశం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More