...
...
Next Story

ఓటీటీలో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్- ఫ్యామిలీకి కోతి శాపం- వణికిపోయే రీతిలో మరణాలు- తెలుగులో స్ట్రీమింగ్- ఇక్కడ చూడండి!

ఓటీటీలో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ ది మంకీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో సహా నాలుగు భాషల్లో ది మంకీ ఓటీటీ రిలీజ్ అయింది. కోతి బొమ్మ తలుచుకుంటే చాలు మనుషులు ఘోరంగా చనిపోతుంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ది మంకీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 30, 2025, 05:33:08 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. రొటీన్ స్టోరీ అయిన టేకింగ్ ఎంత థ్రిల్లింగ్‌గా, భయపెట్టేలా ఉంటే అంత హిట్ అవుతాయి. ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్, ఎప్పుడు చూడని సన్నివేశాలతో మలిస్తే ఆ హారర్ మూవీకి వచ్చే రెస్పాన్స్ మరోలా ఉంటుంది.

హారర్ అంశాలే ఎక్కువగా

ఓటీటీలో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్- ఫ్యామిలీకి కోతి శాపం- వణికిపోయే రీతిలో మరణాలు- తెలుగులో స్ట్రీమింగ్- ఇక్కడ చూడండి!
ఓటీటీలో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్- ఫ్యామిలీకి కోతి శాపం- వణికిపోయే రీతిలో మరణాలు- తెలుగులో స్ట్రీమింగ్- ఇక్కడ చూడండి!

అలాంటి హారర్ థ్రిల్లర్ సినిమానే ది మంకీ. ఇది ఒక అమెరికన్ డార్క్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా. కానీ, ఇందులో ఎక్కువగా హారర్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఒక కోతి బొమ్మ చుట్టూ ఈ సినిమా అంత సాగుతుంది. ఒక ఫ్యామిలీలో ఓ కోతి బొమ్మ ఉంటుంది. అది డ్రమ్ వాయించే కోతి బొమ్మ.

ఊహించని విధంగా

ఆ బొమ్మకు కీ ఇస్తే డ్రమ్ వాయిస్తుంది. కానీ, కొన్నిసార్లు ఎలాంటి కీ ఇవ్వకుండానే డ్రమ్ వాయిస్తుంది. అలా చేసిందంటే ఒకరు అతి ఘోరంగా, ఊహించని విధంగా చనిపోతారు. ఇది హీరో కుటుంబానికి శాపంగా ఉంటుంది. ఆ కోతి బొమ్మ వల్ల తన ఫ్యామిలీలో ఒక్కొక్కరిగా చనిపోతుంటారు.

ఎంత ప్రయత్నించినా

ఆ కోతి బొమ్మను పాతిపెట్టిన, నరికినా, దూరంగా విసిరేసిని తిరిగి మళ్లీ హీరో కుటుంబానికే వచ్చి చేరుకుంటుంది. దాంతో హీరో ఏం చేయలేక ఆ కోతి బొమ్మ దగ్గర మనుషులు ఉండకుండా చూసుకుంటాడు. కానీ, ఎంత ప్రయత్నించినా ఎవరో ఒకరు చనిపోతుంటారు. మరి హీరో తన కుటుంబంలో ఎంతమందిని కాపాడుకోగలిగాడు?, ఆ శాపాన్ని విముక్తి చేసుకోగలిగాడా? అనేదే ది మంకీ మూవీ స్టోరీ.

నాలుగు భాషల్లో

కేవలం గంట 38 నిమిషాలు ఉన్న ది మంకీ సినిమాకు ఓజ్ పెర్కిన్స్ (ఓస్‌గుడ్ పెర్కిన్స్) దర్శకత్వం వహించారు. స్టిఫెన్ కింగ్ రాసిన ది మంకీ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. యూనైటెడ్ స్టేట్స్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ది మంకీ మంచి కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

డిఫరెంట్ హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు భాషలో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నది మంకీపై లుక్కేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks