The Paradise: నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ సృష్టిస్తోంది. 1980ల నాటి సికింద్రాబాద్ పారడైజ్ ప్రాంత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాపై ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆడియెన్స్ నుంచి విభిన్నమైన రెస్పాన్స్ వస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో 'పారడైజ్' జాతర.. నైజాంలో రికార్డు బుకింగ్స్

తెలంగాణ నేటివిటీ, గద్దర్ పాటల స్ఫూర్తి, పక్కా లోకల్ తెలంగాణ యాసతో తెరకెక్కిన 'ది పారడైజ్' చిత్రానికి తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మరథం పడుతున్నారు. నైజాం పరిధితో పాటు హైదరాబాద్ సిటీలో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. ఒక్క హైదరాబాద్‌లోనే ప్రీమియర్స్, తొలి రోజు అడ్వాన్స్ సేల్స్ రూపంలో రూ.7.4 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ నమోదు చేసింది.
సికింద్రాబాద్ స్లమ్ నేపథ్యంలో 'సవారి' గిరిజన తెగ హక్కుల కోసం నాని (జడల్ క్యారెక్టర్) చేసే పోరాటం, రౌద్రం, రాత్రివేళల్లో వచ్చే ఊరమాస్ ఫైట్ సీన్లు తెలంగాణ యూత్ ని తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతి, రాజకీయం, పోరాట నేపథ్యం కథలో బలంగా ఉండటంతో ఇక్కడి సింగిల్ స్క్రీన్స్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది.
ఆంధ్రా ఆడియెన్స్ రియాక్షన్.. పొలిటికల్ టచ్ పై భిన్నమైన చర్చ
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆడియెన్స్, నెటిజన్ల నుంచి ఈ సినిమాపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో చూపించిన పొలిటికల్ ఎలిమెంట్స్, కేసీఆర్ అలాగే ఎన్టీఆర్ పాత్రల పోలికలతో ఉన్న కొన్ని పొలిటికల్ సీన్స్ ఆంధ్రా ప్రాంత ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేదనే టాక్ వస్తోంది. ఫ్యూడల్ వ్యవస్థ, స్థానిక రాజకీయం చుట్టూ తిరిగే పాయింట్ అక్కడ కొంత మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
అంతేకాదు తెలంగాణ యాస తమకు అర్థం కావడం లేదని కొందరు, అసలు టాలీవుడ్ హీరోలు ఈ యాసలో సినిమాలు చేయొద్దంటూ మరికొందరు ట్వీట్స్ చేస్తుండటం గమనార్హం.
{{/usCountry}}అంతేకాదు తెలంగాణ యాస తమకు అర్థం కావడం లేదని కొందరు, అసలు టాలీవుడ్ హీరోలు ఈ యాసలో సినిమాలు చేయొద్దంటూ మరికొందరు ట్వీట్స్ చేస్తుండటం గమనార్హం.
{{/usCountry}}దీనికితోడు సినిమాలో చూపించిన రా అండ్ రస్టిక్ హింస, ఏ-సర్టిఫికేట్ కంటెంట్ కుటుంబ ప్రేక్షకులను కొంతవరకు దూరంగా ఉంచేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఉన్నంత ఊపు ఆంధ్రా బాక్సాఫీస్ సెంటర్లలో కనిపించడం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
నాని విశ్వరూపం.. సెకండాఫ్ పెద్ద మైనస్
ఈ సినిమాలో నాని పర్ఫార్మన్స్ విషయానికొస్తే.. 'దసరా' తర్వాత మళ్లీ అదే జోష్ లో ఈ మూవీలోనూ నటించాడు. జడల్ పాత్రలో నాని నటన, జైలు సీన్, హోటల్ ఫైట్ సీక్వెన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బీజీఎమ్, జి.కె. విష్ణు కెమెరా వర్క్ సినిమాకి నెక్స్ట్ లెవెల్ రిచ్ లుక్ తీసుకొచ్చాయి. మోహన్ బాబు షికాంజా మాలిక్ పాత్రలో విలనిజం పండించారు.
అయితే ఫస్టాఫ్ ఇచ్చిన హై ఎలివేషన్ తర్వాత సెకండ్ హాఫ్ కథనంలో స్పీడ్ తగ్గడం, ఎడిటింగ్ లో క్లారిటీ లేకపోవడం, ఎమోషనల్ కనెక్ట్ తగ్గడంపై రివ్యూవర్స్ పెదవి విరుస్తున్నారు. తొలి సగం ఉన్నంత గ్రిప్పింగ్ గా సెకండాఫ్ లేకపోవడం వల్ల చాలా వరకు నెగటివ్ రివ్యూలు వస్తున్నాయి.
రూ.40 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర నాని కొత్త హిస్టరీ
టాక్ ఎలా ఉన్నా 'ది పారడైజ్' సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ వైడ్ గా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్, పెయిడ్ ప్రిమియర్స్ ద్వారానే రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నాని కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. గతంలో 'హిట్: ది థర్డ్ కేస్' సాధించిన రూ.37.8 కోట్ల రికార్డును ఇది తుడిచిపెట్టేసింది.
శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.