The Paradise Teaser: రక్తంతో తడిసిన పిడికిలి.. పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్.. ది ప్యారడైజ్ మూవీ టీజర్‌ ముహూర్తం ఫిక్స్

The Paradise Teaser: నాని ది ప్యారడైజ్ మూవీ టీజర్ ముహూర్తం ఖరారైంది. ఆ టైమ్ రివీల్ చేస్తూ మూవీ మేకర్స్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో రక్తంతో తడిసిన నాని పిడికిలిని చూడొచ్చు.

Published on: Aug 5, 2026, 20:55:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Paradise Teaser: 'దసరా' వంటి ఊరమాస్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise). ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ టీజర్ అప్‌డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రివీల్ చేశారు.

The Paradise Teaser: రక్తంతో తడిసిన పిడికిలి.. పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్.. ది ప్యారడైజ్ మూవీ టీజర్‌ ముహూర్తం ఫిక్స్
The Paradise Teaser: రక్తంతో తడిసిన పిడికిలి.. పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్.. ది ప్యారడైజ్ మూవీ టీజర్‌ ముహూర్తం ఫిక్స్

రేపు అంటే గురువారం (ఆగస్ట్ 6) సాయంత్రం 6 గంటలకు 'ది ప్యారడైజ్' రఫ్ అండ్ రఫ్ టీజర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక షాకింగ్ ఇంటెన్స్ పోస్టర్‌ను వదిలారు.

రక్తం చిందిస్తున్న పిడికిలి.. రేజర్ బ్లేడ్లతో ఊరమాస్ లుక్

తాజాగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. కటిక చీకటి బ్యాక్‌డ్రాప్‌లో రక్తంతో తడిసిపోయిన పిడికిలి, దానికి చుట్టిన నల్లటి తాడు, ఆ తాడుకు కట్టిన పదునైన రేజర్ బ్లేడ్లు చూస్తుంటే ఈ సినిమాలో నాని క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది.

ఈ చిత్రంలో నాని 'జడల్' (Jadal) అనే అత్యంత శక్తివంతమైన, తిరుగుబాటుదారుడి పాత్రలో కనిపిస్తున్నారు. బాధ, తిరుగుబాటు, పట్టుదలకు ప్రతీకగా రూపుదిద్దిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారా స్థాయికి తీసుకెళ్లింది.

95 సెకన్ల విధ్వంసం.. అనిరుధ్ బీజీఎం నెక్స్ట్ లెవెల్

ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ టీజర్ నిడివి దాదాపు 95 సెకన్లు ఉండబోతోంది. నాని రఫ్ విజువల్స్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడై టీజర్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

'దసరా'లో మాస్ ఎమోషన్‌ను పీక్స్‌లో చూపించిన శ్రీకాంత్ ఓదెల.. ఈసారి 'ది ప్యారడైజ్' కోసం మరింత రా అండ్ రస్టిక్ యాక్షన్ వరల్డ్‌ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ పోస్టర్‌ను ట్రెండ్ చేస్తూ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు.

బిగ్ స్టార్ కాస్టింగ్.. సీనియర్ నటుల దండయాత్ర

ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నాని సరసన యంగ్ బ్యూటీ కయదు లోహర్ (Kayadu Lohar) కథానాయికగా నటిస్తోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతుండటం బిగ్ హైలైట్‌గా మారనుంది.

వీరితో పాటు బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి, రాఘవ్ జుయల్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతమంది వర్సటైల్ యాక్టర్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటంతో ప్రాజెక్ట్ రేంజ్ పెరిగిపోయింది.

సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్

ఎస్ ఎల్ వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో, కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా డిజైన్ చేస్తున్నారు.

అన్ని భాషల ఆడియన్స్‌ను అలరించేలా ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. రేపు రాబోయే టీజర్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ రేసులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More