The Paradise Trailer: షాకింగ్.. ట్రైలర్ లేకుండానే రిలీజ్ కాబోతున్న ది ప్యారడైజ్.. కారణమేంటో చెప్పిన నాని
The Paradise Trailer: నాని నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీ ట్రైలర్ లేకుండా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా యూనిట్ తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించగా.. అందులో ట్రైలర్ రిలీజ్ పై నాని పూర్తి స్పష్టతనిచ్చారు.
The Paradise Trailer: నేచురల్ స్టార్ నాని తన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise) విషయంలో ఎవ్వరూ ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకి అసలు థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయడం లేదని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ నాని స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

ప్రెస్ మీట్‌లో నాని క్లారిటీ.. అసలు కారణం ఏంటంటే?
ది ప్యారడైజ్ మూవీ ట్రైలర్ రావడం లేదనే వార్తలతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ ప్రచారమయ్యాయి. వీటిపై క్లారిటీ ఇవ్వడానికే నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, మల్టిపుల్ యూనిట్స్ ఒకేసారి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాయని నాని చెప్పారు. సరైన ట్రైలర్ కట్ చేయడానికి సరిపడా టైమ్ లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
హడావుడిగా ఒక ట్రైలర్ కట్ చేసి వదిలేకంటే, ఆ టైమ్‌ని సినిమా పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ కోసం కేటాయించడమే కరెక్ట్ అని టీమ్ భావించినట్లు తెలిపారు. సినిమా కోసం ఎంత కష్టపడుతున్నామో, ప్రేక్షకుల నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఈ బోల్డ్ డెసిషన్ తీసుకున్నామని నాని స్పష్టం చేశారు.
"సినిమానే ముఖ్యం.. ఆడియన్స్‌ను లైట్ తీసుకోవట్లేదు!"
"ట్రైలర్ కంటే థియేటర్లలోకి వచ్చే సినిమా క్వాలిటీనే మాకు చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని నమ్ముతున్నాం. అలాగని ఆడియన్స్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఒకవేళ హడావుడిగా ట్రైలర్ కట్ చేస్తే మేం అనుకున్న అవుట్‌పుట్ రాదు. అందుకే నేరుగా బిగ్ స్క్రీన్ మీదే మా విశ్వరూపం చూపిస్తాం" అని నాని ధీమా వ్యక్తం చేశారు.
సరిపడా టైమ్ లేకపోయినా క్వాలిటీ పోకుండా పర్ఫెక్ట్ ప్రాడక్ట్ ఇవ్వడానికే రాత్రీపగలూ కష్టపడుతున్నట్లు నాని చెప్పారు. సినిమాపై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, బాక్సాఫీస్ దగ్గర సినిమా కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని హామీ ఇచ్చారు.
రూమర్స్ కు చెక్ పెట్టిన నేచురల్ స్టార్
గత కొద్దిరోజులుగా ఇంటర్నెట్‌లో 'ది ప్యారడైజ్' మూవీకి సంబంధించి అనేక వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో భారీ అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని, ఏకంగా 1000 మంది ఫైటర్లతో ఒక బిగ్గేస్ట్ యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేశారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ వార్తలపై నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ, "సినిమాలో ఎలాంటి అండర్‌వాటర్ ఫైట్ లేదు.. అలానే 1,000 మందితో చేసిన యాక్షన్ సీన్ కూడా ఏదీ ప్లాన్ చేయలేదు" అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హైప్ కోసం సృష్టించిన ఇలాంటి ఫేక్ వార్తలను అభిమానులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలపై వచ్చిన ప్రచారం నిజమేనా?
షూటింగ్ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సెట్స్‌లో కొందరిపై చెయ్యి చేసుకున్నారంటూ వచ్చిన రూమర్స్‌పై కూడా నాని గట్టిగానే రియాక్ట్ అయ్యారు. "శ్రీకాంత్ ఎవరినీ కొట్టలేదు, అసలు సెట్స్‌లో ఎలాంటి గొడవలు జరగలేదు" అని తేల్చిచెప్పారు.
దీంతో పాటు సినిమాలో నాని క్యారెక్టర్ 'జడల్' జడ బరువు 6 కేజీలు ఉందంటూ వస్తున్న వార్తలను నాని పూర్తిగా ఖండించారు. పాత్ర లుక్ డిజైన్ చాలా రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది తప్ప, ప్రచారంలో ఉన్న లెక్కలన్నీ అబద్ధాలని నాని క్లారిటీ ఇచ్చారు.
సంచలనాలు సృష్టిస్తున్న 'దసరా' కాంబినేషన్
బ్లాక్‌బస్టర్ హిట్ 'దసరా' తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో 'ది ప్యారడైజ్' పై ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ హైప్ ఉంది. శ్రీకాంత్ ఓదెల విజన్, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో పీక్స్ లో ఉండబోతున్నాయి. 'సరిపోదా శనివారం' సక్సెస్ తర్వాత నాని నటిస్తున్న ఈ హై-వోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్ రేంజ్ ఏంటో ట్రేడ్ లెక్కలే చెబుతున్నాయి.
ట్రైలర్ లేకుండానే సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం టాలీవుడ్‌లో ఒక రేర్ అండ్ బోల్డ్ అటెంప్ట్ అని చెప్పాలి. పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్స్ పర్ఫెక్ట్‌గా ఫినిష్ చేసి ఆడియన్స్ ముందుకు రావడమే తమ ప్రైమరీ గోల్ అని మూవీ టీమ్ తేల్చిచెప్పేసింది. మరి ఈ బోల్డ్ ప్లాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


