Youtube Top 10 Songs: యూట్యూబ్ టాప్ 10 సాంగ్స్ ఇవే.. నాని ఏషనాగుల సాంగ్ నంబర్ వన్.. ఇరుముడి నుంచి రెండు సాంగ్స్
Youtube Top 10 Songs: యూట్యూబ్ టాప్ 10 సాంగ్స్ లిస్ట్ వచ్చేసింది. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 3 మధ్య ఇండియాలో ఎక్కువగా వింటున్న సాంగ్స్ రాగా.. వీటిలో నాని ది పారడైజ్ మూవీలోని ఏషనాగుల సాంగ్ నంబర్ వన్ గా నిలిచింది.
Youtube Top 10 Songs: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' (The Paradise) నుంచి విడుదలైన 'ఏషనాగుల' సాంగ్ యూట్యూబ్ ఇండియా మ్యూజిక్ చార్ట్స్ ను షేక్ చేస్తోంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్స్ లిస్ట్‌లో ఈ పాట ఏకంగా నంబర్ 1 పొజిషన్ దక్కించుకుని రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

యూట్యూబ్ టాప్ 10 సాంగ్స్ ఇవే
• ఏషనాగుల సాంగ్ 4.57 కోట్ల వ్యూస్
• కళ్యాణి రీమిక్స్ - శ్రేయా ఘోషాల్ 3.75 కోట్ల వ్యూస్
• ముత్తా కళక్కి (యూత్) 2.79 Cr కోట్ల వ్యూస్
• మల్లెపూల పల్లకి సాంగ్ 2.57 కోట్ల వ్యూస్
• ఇరుముడి కట్టు సాంగ్ 2.41 కోట్ల వ్యూస్
• బర్సాత్ (బంజారే -హిందీ) 2.01 కోట్ల వ్యూస్
• షరారత్ - ధురంధర్
• గెహ్రా హువా - ధురంధర్
• తేరా మేరా రిష్తా - ఆవారాపన్ 2
• బాసింగ బల్లు సాంగ్
రికార్డు వ్యూస్‌తో 'ఏషనాగుల' నంబర్ 1 విధ్వంసం
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై ఇప్పటికే పాన్-ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నుంచి విడుదలైన 'ఏషనాగుల' పాట కేవలం ఒక్క వారంలోనే 4.57 కోట్లకు పైగా వ్యూస్ సాధించి టాప్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
నాని మాస్ అవతార్, పవర్ ఫుల్ బీట్స్, లోకల్ ఫ్లేవర్ కలగలిపిన ఈ సాంగ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ రూపంలో సోషల్ మీడియాను ఊపేస్తోంది. సౌత్ మ్యూజిక్ పవర్ ఏంటో ఈ సాంగ్ సక్సెస్ మరోసారి ప్రపంచానికి ప్రూవ్ చేసింది.
టాప్ 5లో సౌత్ పాటల దండయాత్ర
ఈ వారం యూట్యూబ్ టాప్ 10 లిస్ట్‌లో సౌత్ పాటల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ సీనియర్ సింగర్ శ్రేయా ఘోషాల్ పాడిన 'కళ్యాణి (రీమిక్స్)' సాంగ్ 3.75 కోట్లకు పైగా వ్యూస్‌తో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇక 'యూత్' సినిమాలోని 'ముట్ట కలక్కి' పాట ఊహించని రీతిలో రేంజ్ మార్చింది. గత వారం 23వ స్థానంలో ఉన్న ఈ పాట ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 2.79 కోట్లకు పైగా వ్యూస్‌తో మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. దీనితో పాటు ఇరుముడి మూవీ నుంచి 'మల్లెపూల పల్లకి' (2.57 కోట్లు), 'ఇరుముడి కట్టు' (2.41 కోట్లు) వరసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచి సౌత్ మ్యూజిక్ క్రేజ్‌ను చాటిచెప్పాయి.
బాలీవుడ్‌కు కేవలం 4 స్పాట్‌లు మాత్రమే..
మరోవైపు బాలీవుడ్ నుంచి కేవలం నాలుగు పాటలు మాత్రమే టాప్ 10లో చోటు సంపాదించుకోగలిగాయి. 'బర్సాత్ - బంజారే' సాంగ్ 2.01 కోట్ల వ్యూస్‌తో ఆరో స్థానంలో నిలవగా, రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ సినిమా 'ధురంధర్' నుంచి వచ్చిన 'షరారత్', 'గెహ్రా హువా' పాటలు ఏడు, ఎనిమిదో స్థానాలను దక్కించుకున్నాయి.
ఇమ్రాన్ హష్మీ కంబ్యాక్ ప్రాజెక్ట్ 'ఆవారాపన్ 2' లోని 'తేరా మేరా రిష్తా' పాట గత వారం రెండో స్థానంలో ఉండగా, ఈ వారం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఇక పదో స్థానంలో 'బాసింగా బాల్లు' నిలిచింది. ఈ మ్యూజిక్ ట్రెండ్ చూస్తుంటే నేషనల్ వైడ్‌గా ఆడియన్స్ నార్త్ కంటే సౌత్ మాస్ మ్యూజిక్ బీట్స్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


