Irumudi Song: ఇరుముడి కట్టు.. ఇరుముడి నుంచి వచ్చేసిన ఫస్ట్ సాంగ్.. భక్తితో ఊగిపోయిన రవితేజ.. పారవశ్యంలో ముంచే పాట
Irumudi Song: మాస్ మహారాజా నుంచి భక్తుడిగా మారిన రవితేజ లేెటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ‘ఇరుముడి కట్టు’ అనే ఈ సాంగ్ భక్తి పారవశ్యంలో ముంచేలా ఉంది. ఈ పాటలో రవితేజ భక్తితో ఊగిపోయాడు. మనసును తాకే లిరిక్స్ తో ఉన్న ఈ సాంగ్ పూర్తి వివరాలు చూసేయండి.
Irumudi Song: ‘ఇరుముడి కట్టు’ అంటూ రవితేజ భక్తి పారవశ్యంలో మునిగి తేలాడు. అతను హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ డివోషనల్ థ్రిల్లర్ ‘ఇరుముడి’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. ‘ఇరుముడి కట్టు’ అంటూ సాగుతున్న ఈ పాటలోని లిరిక్స్ భక్తుల మనసులను తాకేలా ఉన్నాయి.

ఇరుముడి కట్టు సాంగ్
రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఇరుముడి మూవీపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ హైప్ ను మరింత పెంచేలా ‘ఇరుముడి కట్టు’ సాంగ్ రిలీజ్ అయింది. ఇవాళ (జూన్ 29) ఈ ఇరుముడి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అయిన ఇరుముడి కట్టును మేకర్స్ విడుదల చేశారు.
భక్తితో ఊగిపోయిన రవితేజ
స్వామియే శరణమయ్యప్ప అంటూ స్టార్ట్ అయిన ఈ సాంగ్ లాస్ట్ వరకు కూడా భక్తులకు మళ్లీ మళ్లీ వినిపించేలా ఉంది. ‘ఇరుముడి కట్టు’ అంటూ సాగుతున్న లిరిక్స్ తగ్గట్లుగా భక్తి పారవశ్యంతో రవితేజ మునిపోయి స్టెప్పులు వేయడం ఆకట్టుకుంది. ఈ లిరికల్ వీడియో ఇన్ స్టంట్ వైరల్ గా మారింది.
జీవీ ప్రకాష్ మ్యూజిక్
ఇరుముడి సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో రెండు అయ్యప్ప సాంగ్స్ ఉంటాయని ఇప్పటికే జీవీ ప్రకాష్ క్లారిటీ ఇచ్చాడు. ఇందులో నుంచి ఫస్ట్ సాంగ్ సోమవారం రిలీజైంది. ఈ పాటను అనంతు చక్కగా పాడారు. ఈ సాంగ్ లిరిక్స్ ను కళ్యాణ్ చక్రవర్తితో కలిసి స్వయంగా డైరెక్టర్ శివ నిర్వాణ రాయడం విశేషం. శివ నిర్వాణ మంచి లిరిసిస్ట్ కూడా అన్న సంగతి తెలిసిందే.
రిలీజ్ డేట్
ఇరుముడి మూవీ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ ఇరుముడి కట్టు సాంగ్ ను తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేశారు. ఇందులో రవితేజ సరసన ప్రియా భాస్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ కూతరిగా బేబీ నక్షత్ర యాక్ట్ చేస్తోంది. ఇరుముడి సినిమాను మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు.
అయ్యప్ప మాల
మాస్ మహారాజా రవితేజకు వరుసగా ఫ్లాప్ లు ఎదురవుతున్నాయి. రొటీన్ మాస్ మసాలా స్టోరీలతోనే అతను మూవీస్ తీస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రవితేజ రూట్ మార్చాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్ అండ్ డివోషనల్ టచ్ ఉన్న ‘ఇరుముడి’ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఇరుముడి టీజర్ లో రవితేజ పూర్తి డిఫరెంట్ గా కనిపించాడు. ఈ మూవీలో అతను అయ్యప్ప మాల వేసుకున్న భక్తుడిగా నటిస్తున్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


