Irumudi: హిట్ కోసం గట్టిగానే ప్లాన్ చేసిన రవితేజ.. ఇరుముడిలో రెండు అయ్యప్ప పాటలు.. కన్ఫామ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్

Irumudi Songs: వరుస ఫ్లాప్ లకు చెక్ పెట్టాలని టార్గెట్ పెట్టుకున్న మాస్ మహారాజా రవితేజ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు. జోనర్ మార్చడమే కాకుండా మ్యూజిక్ తోనే మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యాడు. అతను హీరోగా వస్తున్న ‘ఇరుముడి’ సినిమాలో రెండు అయ్యప్ప సాంగ్స్ తో థియేటర్లలో జనాలకు పూనకాలు తెప్పించనున్నారు. 

Published on: Jun 29, 2026, 05:53:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Irumudi Songs: ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌లతో బాక్సాఫీస్ వద్ద మాస్ హంగామా సృష్టించే మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఈసారి సరికొత్త జోనర్‌ను టచ్ చేస్తున్నాడు. అతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ సినిమా మ్యూజిక్ ముచ్చట్లు ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారాయి.

హిట్ కోసం గట్టిగానే ప్లాన్ చేసిన రవితేజ (x/MythriOfficial)
హిట్ కోసం గట్టిగానే ప్లాన్ చేసిన రవితేజ (x/MythriOfficial)

ఇరుముడి మ్యూజిక్

జాతీయ అవార్డు గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash) సంగీతం అందిస్తున్న ఇరుముడి చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి సిద్ధమవుతోంది. ఇందులో రెండు అయ్యప్ప పాటలు ఉండబోతున్నట్లు జీవీ ప్రకాష్ స్పష్టం చేశాడు. దీంతో థియేటర్లో జనాలు భక్తితో ఊగిపోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

రెండు అయ్యప్ప పాటలు

రవితేజ హీరోగా వస్తున్న ఇరుముడి ఈ సినిమాలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో రెండు ప్రత్యేకమైన అయ్యప్ప స్వామి పాటలు ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనున్నాయి.

ఇవాళ ఫస్ట్ సాంగ్

ఇరుముడి మూవీ నుంచి ఇవాళ (జూన్ 29) ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "కట్టు కట్టు ఇరుముడి కట్టు" అనే ఫస్ట్ సింగిల్‌ను సోమవారం నుంచి మార్మోగనుంది. ఈ విషయాన్ని ఓ వీడియోలో జీవీ ప్రకాష్ కన్ఫామ్ చేశాడు.

పాపులర్ భక్తి పాట

ఇక ఇరుముడి సినిమాలో వచ్చే ఒక అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో ‘మల్లెపూల పల్లకి’ అనే పాపులర్ భక్తి పాట కూడా హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ఈ పాటను ప్రత్యేక సందర్భంలో రిలీజ్ చేస్తామని జీవీ ప్రకాష్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో జీవీ ప్రకాష్ మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఈ భక్తిరస గీతాలు సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాయని రవితేజ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డివోషనల్ థ్రిల్లర్!

హిట్ కోసం తపిస్తున్న రవితేజ ఇప్పుడు డిఫరెంట్ రూట్ ఎంచుకున్నాడు. ఇరుముడి చిత్రం రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా.. భక్తి , ఉత్కంఠభరితమైన ఎలిమెంట్స్ కలయికతో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ డైరెక్టర్. ఈ మూవీ ఆగస్టు 21న థియేటర్లలో రిలీజ్ కానుంది.

అయ్యప్ప భక్తుల సెంటిమెంట్, ఇరుముడి ప్రాముఖ్యత చుట్టూ తిరిగే ఒక బలమైన ఎమోషనల్ & డివోషనల్ థ్రిల్లర్ ఇదని మేకర్స్ స్పష్టం చేశారు. అయ్యప్ప పడి పూజలో వినిపించే రెండు పాపులర్ భక్తి పాటలైన ‘ఇరుముడి కట్టు’, ‘మల్లెపూల పల్లకి’ పాటలతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More