శబరిమలలో 10 లక్షలకు చేరువలో భక్తులు.. అయ్యప్ప దర్శనానికి కొనసాగుతున్న రద్దీ!
శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మండల మకరవిళక్కు తీర్థయాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఆలయాన్ని సందర్శించిన వారి సంఖ్య పది లక్షలకు చేరుకుంటోంది.
శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో రద్దీ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 7 గంటల వరకు 72,385 మంది ఆలయాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు మెుత్తం 9,40,486 మంది దర్శనాలు చేసుకున్నారు. ఈరోజుతో పది లక్షల మార్క్ దాటుతుంది. ఆలయ రద్దీకి అనుగుణంగా పంపా నుండి భక్తులను బయటకు పంపుతున్నారు.

మండల పూజ్ సీజన్‌లో బాగంగా ఈ నెల 16వ తేదీన శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో కేరళ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రోజూవారీ స్పాట్ బుకింగ్స్ ఐదు వేలకు పరిమిత చేశారు. భక్తుల రద్దీ ఆధారంగా పెంచుకోవాని కోర్టు సూచించింది. పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. మండల మకరవిళక్కు సీజన్‌లో శబరిమల ఆదాయం రూ.60 కోట్లు దాటింది.
భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఏర్పా్ట్లు చేసింది. ఆన్‌లైన్ స్లాట్లు, స్పాట్ బుకింగ్స్ వెంటవెంటనే అయిపోతున్నాయి. పంపా బేస్ వద్ద నుంచే భక్తులు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. సన్నిధానం చేరుకునేందుకు చాలా టైమ్ పడుతుంది.
బస్సు బోల్తా
మరోవైపు శబరిమల యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడింది, 20 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కొల్లం-తేని జాతీయ రహదారిపై కుట్టిక్కనం, వల్లంజకణం మధ్య ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడులోని కరూర్ నుండి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు కుట్టిక్కనం దాటి వెళ్తుంటే ఒక వంపు వద్ద నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. అందులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగింది. గాయపడిన వారిలో ఒకరికి తలకు తీవ్ర గాయం కాగా, మరొకరికి చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను ముండక్కాయం మెడికల్ ట్రస్ట్ ఆసుపత్రికి తరలించారు, పరిస్థితి విషమంగా ఉన్న వారిని కొట్టాయం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రయాణికులు, హైవే పోలీసులు, అగ్నిమాపక దళం సహాయక చర్యలను వేగంగా చేపట్టారు. కొండ ప్రాంతాలతో డ్రైవర్లకు తెలియకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని పోలీసు అధికారులు తెలిపారు. కొండ ప్రాంతాల్లో రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


