యానిమల్స్‌కు రిలేట్ చేస్తున్న సినిమాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఓటీటీలో ఎన్నో రకాల జోనర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ పెట్స్‌ను బేస్ చేసుకుని ఒక కథను అల్లుకుని తెరకెక్కించే సినిమాలు ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటాయి.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్

అలా ఇటీవల ప్రేక్షకులను ఆకర్షించిన సినిమానే ది పెట్ డిటెక్టివ్. మలయాళంలో కామెడీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా ది పెట్ డిటెక్టివ్ తెరకెక్కింది. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ష్రాఫ్ యు దీన్ ప్రధాన పాత్రలు పోషించారు. నివిన్ మిర్రర్, జియోమోన్ జ్యోతిర్, ప్రశాంత్ మాధవన్, నివేక్ మిర్రర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ది పెట్ డిటెక్టివ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.5 రేటింగ్ సాధించుకుంది. ఇంతటి క్రేజీ మూవీ ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అది కూడా మరికొన్ని గంటల్లో మలయాళంతోపాటు ఐదు భాషల్లో ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ రిలీజ్ కానుంది.
జీ5 ఓటీటీలో
జీ5లో నవంబర్ 28 నుంచి ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ ప్రీమిర్ కానుంది. నవంబర్ 28 అర్థరాత్రి 12 గంటలకు ది పెట్ డిటెక్టివ్ ఓటీటీ రిలీజ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ వంటి 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఇకపోతే ది పెట్ డిటెక్టివ్ సినిమాకు ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోహీరో అయిన ష్రాఫ్ యు దీన్ ప్రధాన పాత్రలో నటించటంతో పాటు నిర్మాతగానూ తొలి అడుగు వేశారు.
ది పెట్ డిటెక్టివ్ కథ
{{/usCountry}}ఇకపోతే ది పెట్ డిటెక్టివ్ సినిమాకు ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోహీరో అయిన ష్రాఫ్ యు దీన్ ప్రధాన పాత్రలో నటించటంతో పాటు నిర్మాతగానూ తొలి అడుగు వేశారు.
ది పెట్ డిటెక్టివ్ కథ
{{/usCountry}}ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జోస్ అలులా (ష్రాఫ్ యు దీన్) ఓ డిటెక్టివ్. అతనికి చెప్పుకోదగ్గక కేసులుండవు. అయితే తనను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయటానికి ఒప్పుకుంటాడు.
ఈ కేసుని శోధించే క్రమంలో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, కనిపించకుండా పోయిన ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్‌స్పెక్టర్ అందరూ ఎంట్రీ ఇస్తారు.
హై వోల్టేజ్ క్లైమాక్స్
కథలోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, కామెడీ మూవీ లవర్స్ సహా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.
ఈ సందర్భంగా నిర్మాత, నటుడు ష్రాఫ్ యు దీన్ మాట్లాడుతూ.. "‘ది పెట్ డిటెక్టివ్’ సినిమా నాకెంతో ప్రత్యేకం. నటుడిగానే కాదు.. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. ప్రేక్షకులు ఏదో ఎక్కువగా ఆలోచన చేయకుండా సరదాగా, హృదయపూర్వకంగా నవ్వుకునేలా ఓ సినిమా చేయాలని భావించి చేశాం" అని అన్నారు.
తెలుగులో కూడా
"ఇప్పుడు ఈ సినిమాకు జీ5లో మలయాళంలో వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ వెరన్స్‌లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి రావటం ఆనందంగా ఉంది" అని హీరో ష్రాఫ్ యు దీన్ తెలిపారు.