The Raja Saab TV Premiere Date: టీవీలోకి వచ్చేస్తున్న ప్రభాస్ డిజాస్టర్ హారర్ కామెడీ.. టీఆర్పీ రికార్డులు బ్రేక్ చేసేనా?

The Raja Saab TV Premiere Date: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు స్టార్ మా ఛానల్‌లో ఈ చిత్రం ప్రసారం కానుంది.

Published on: Apr 22, 2026, 19:44:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Raja Saab TV Premiere Date: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వెండితెరపై కనిపిస్తే ఆ పూనకాలే వేరు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ‘ది రాజా సాబ్’ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ‘స్టార్ మా’ ఈ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకోగా.. ఈ వీకెండ్ లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయబోతోంది.

The Raja Saab TV Premiere Date: టీవీలోకి వచ్చేస్తున్న ప్రభాస్ డిజాస్టర్ హారర్ కామెడీ.. టీఆర్పీ రికార్డులు బ్రేక్ చేసేనా?
The Raja Saab TV Premiere Date: టీవీలోకి వచ్చేస్తున్న ప్రభాస్ డిజాస్టర్ హారర్ కామెడీ.. టీఆర్పీ రికార్డులు బ్రేక్ చేసేనా?

స్టార్ మా స్పెషల్ ప్రీమియర్..

“ఎవ్రీబడీ స్టెప్ అసైడ్.. రాజా ఈజ్ కమింగ్ టు వైబ్” అంటూ స్టార్ మా సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఆదివారం (ఏప్రిల్ 26) సాయంత్రం 5:30 గంటలకు ఈ సినిమా స్టార్ మా ఛానెల్లో ప్రసారం కానుంది.

ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో మెరిశారు. ఒక పాత బంగ్లా, దాని వెనుక ఉన్న రహస్యం, రాజా సాబ్‌గా ప్రభాస్ చేసే సందడి బుల్లితెరపై ఏ రేంజ్ టీఆర్పీ రేటింగ్స్ రాబడుతుందో చూడాలి. ఈ మధ్య బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన సినిమాలకు కూడా టీవీలో పెద్దగా రేటింగ్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ కు ఇది ఓ పరీక్షే అని చెప్పాలి.

సినిమా నిడివి, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల విషయంలో థియేట్రికల్ రిలీజ్ సమయంలో చర్చ జరిగినప్పటికీ, టెలివిజన్ ఆడియన్స్‌కు మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ సండే ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం ఉంది.

ది రాజా సాబ్ వైబ్స్ షురూ..

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్.. ప్రభాస్‌ను ఒక సరికొత్త వింటేజ్ లుక్‌లో చూపించింది. బాహుబలి, సలార్ వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ప్రభాస్ ఒక హారర్ కామెడీ జోనర్‌లో నటించడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

అయితే థియేటర్లలో మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. కానీ ప్రభాస్ మేనరిజమ్స్, థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు స్టార్ మాలోకి అడుగు పెడుతోంది. ఓటీటీలో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వచ్చిన మొదట్లోనే స్ట్రీమింగ్ రికార్డులన్నింటినీ చెరిపేసింది. మరి ఇప్పుడు టీఆర్పీ రికార్డులను కూడా తిరగరాస్తుందేమో చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. 'ది రాజా సాబ్' సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ఎప్పుడు?

ఈ సినిమా ఏప్రిల్ 26, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుంది.

2. ది రాజా సాబ్ సినిమా దర్శకుడు ఎవరు?

ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది.

3. ది రాజా సాబ్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది?

ది రాజా సాబ్ మూవీ ప్రస్తుతం జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు వివిధ భాషల్లో అందుబాటులో ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More