...
...
Next Story

ఈ వారం సౌత్ ఇండియా స్పెషల్ సినిమాలు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఒక్కోటి.. రెండు ఓటీటీల్లో రెండేసి చిత్రాలు

ఈ వారం ఓటీటీలో సౌత్ ఇండియన్ సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. ఇందులో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఇవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి.

Published on: Nov 28, 2025, 21:49:08 IST
Advertisement

ఈ వారం సౌత్ ఇండియన్ సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఇందులో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఒక్కో సినిమా స్పెషల్ గా ఉన్నాయి. ఇందులో మిస్టరీస్, గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. అవి ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఓ సారి చూసేయండి.

మాస్ జాతర (తెలుగు)

ఈ వారం ఓటీటీలోని సౌత్ ఇండియా స్పెషల్ సినిమాలు (X)
ఈ వారం ఓటీటీలోని సౌత్ ఇండియా స్పెషల్ సినిమాలు (X)

మాస్ జాతర స్టోరీ న్యాయాన్ని కోరుకునే ఒక రైల్వే పోలీస్ అధికారి చుట్టూ తిరుగుతుంది. ఒక పెద్ద డ్రగ్ రాకెట్‌ను ఛేదించడంలో కీలకపాత్ర పోషించే అతనికి, ఒక క్రూరమైన ముఠాతో పోరాటం తప్పదు. ఆ ముఠా ప్రధాన ఆయుధం ఒక పాము. అతను ఒక పెద్ద స్మగ్లింగ్ సరుకును స్వాధీనం చేసుకున్నప్పుడు అతనికి, ముఠాకి మధ్య వైరం ఒక ఆల్-అవుట్ యాక్షన్ వార్‌గా మారుతుంది. మాస్ జాతర సినిమాలో రవితేజ, శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర తదితరులు నటించారు. ఇది నవంబర్ 28న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది.

ది పెట్ డిటెక్టివ్ (మలయాళం)

తన ప్రియురాలు కైకేయిని ఆకట్టుకోవడానికి తండ్రి డిటెక్టివ్ ఏజెన్సీలో చేరే యువకుడు టోనీ చుట్టూ సాగే స్టోరీనే ది పెట్ డిటెక్టివ్ మూవీ. అతను మొదట్లో పెంపుడు జంతువుల డిటెక్టివ్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించినా, త్వరలోనే స్మగ్లర్లకు సంబంధించిన ఒక ప్రమాదకరమైన కేసులో చిక్కుకుంటాడు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో షరఫుద్దీన్, అనుపమ పరమేశ్వరన్, వినాయకన్, వినయ్ ఫోర్ట్, శ్యామ్ మోహన్, జోమోన్ జ్యోతిర్ తదితరులు నటించారు. ఇది నవంబర్ 28న జీ5 ఓటీటీలో విడుదలైంది.

రోనీ (కన్నడ)

అయిదు హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్ స్టోరీనే ఆర్యన్ సినిమా. అతను ఒక ప్రత్యక్ష టీవీ షోను హైజాక్ చేసి, ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని ప్రకటించిన ఒక రచయిత ద్వారా జరిగిన నేరాలను దర్యాప్తు చేస్తాడు. ఆ రచయిత నేరానికి ఒక గంట ముందు బాధితుల పేర్లను వెల్లడిస్తాడు. ఆ తర్వాత సూసైడ్ చేసుకుంటాడు. ఇందులో విష్ణు విశాల్, సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి, తారక్ పొనప్ప, రాజా రాణి పాండియన్ తదితరులు నటించారు. ఇది నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks