...
...
Next Story

Thriller Web Series: నమ్ముకున్న బాబానే రేప్ చేస్తే..? దొంగ బాబాపై 17 ఏళ్ల యువతి పోరాటం.. ఓటీటీలోకి థ్రిల్లర్ వెబ్ సిరీస్

Thriller Web Series: థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు జియోహాట్‌స్టార్ పండగలాంటి న్యూస్ చెప్పింది. తన కొత్త సిరీస్ హుంకార్ ది రోర్ ట్రైలర్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 25 నుంచి ఈ కొత్త సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Published on: Sep 10, 2026, 18:34:15 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Thriller Web Series: జియోహాట్‌స్టార్ ఓటీటీ మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. నమ్ముకున్న బాబానే రేప్ చేస్తే 17 ఏళ్ల యువతి అతనిపై ఎలాంటి పోరాటం చేసిందన్నదే ఈ సిరీస్ అసలు స్టోరీ. మీనూ రావత్ అనే ఆ అమ్మాయి పాత్రలో సయ్యారా మూవీ ఫేమ్ అనీత్ పడ్డా నటించడం విశేషం. జియోహాట్‌స్టార్ మోస్ట్ అవేటెడ్ సోషియో-కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ 'హుంకార్: ది రోర్' (Hunkkaar: The Roar) అఫీషియల్ ట్రైలర్ రిలీజై సోషల్ మీడియాను ఊపేస్తోంది.

బాప్జీ సామ్రాజ్యంలో నిప్పు రాజేసిన మీనూ రావత్

Thriller Web Series: నమ్ముకున్న బాబానే రేప్ చేస్తే..? దొంగ బాబాపై 17 ఏళ్ల యువతి పోరాటం.. ఓటీటీలోకి థ్రిల్లర్ వెబ్ సిరీస్
Thriller Web Series: నమ్ముకున్న బాబానే రేప్ చేస్తే..? దొంగ బాబాపై 17 ఏళ్ల యువతి పోరాటం.. ఓటీటీలోకి థ్రిల్లర్ వెబ్ సిరీస్

శబరి ఫోర్ట్ లోని మహాషేర్ణి స్కూల్ విద్యార్థిని మీనూ రావత్ (అనీత్ పడ్డా) అక్కడ దేవుడిలా చలామణి అయ్యే బాప్జీ (రఘుబీర్ యాదవ్) పైన సంచలన రేప్ ఆరోపణలు చేస్తుంది. వ్యవస్థను శాసించే బాబాపై ఓ చిన్నపిల్ల గళం విప్పడం కలకలం రేపుతుంది.

ట్రైలర్ ఆరంభంలోనే ఐవో ఏసీపీ జస్లీన్ సింగ్ సోనిగా ఫాతిమా సనా షేక్ ఎంట్రీ ఇచ్చి కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తుంది. ఆ ప్రాంతంలోనే అత్యంత పవర్ ఫుల్ బాబా అయినా కూడా, తాను 17 ఏళ్ల నిస్సహాయిరాలిని అయినా కూడా మీనూ రావత్ మాత్రం వెనకడుగు వేయదు.

కోర్ట్‌రూమ్‌లో హై డ్రామా.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

బాప్జీ వైపు నుంచి బడా లాయర్‌గా రామ్ కపూర్ రంగంలోకి దిగితే, మీనూ తరుపున న్యాయం కోసం పోరాడే అడ్వకేట్ భాలేశ్వర్‌గా మహమ్మద్ జీషాన్ అయూబ్ నటిస్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్, కోర్ట్‌రూమ్ వాదనలు, మీడియా డ్రామా చుట్టూ కథ అత్యంత ఇంటెన్స్‌గా సాగుతుంది.

పవర్, నిజం మధ్య జరిగే ఈ యుద్ధం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ మాథుర్ కూడా ఈ సిరీస్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రొడక్షన్ మార్క్

అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, బిర్లా స్టూడియోస్, మంగతా ఫిల్మ్స్ కాంబినేషన్‌లో కరణ్ డి కపాడియా, నిత్య మెహ్రా, హీరాజ్ మార్ఫాటియా ముగ్గురు దర్శకులు ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

తన మీనూ పాత్ర గురించి అనీత్ పడ్డా స్పందించింది. "మీనూ క్యారెక్టర్ సైలెంట్‌గా లొంగిపోయే రకం కాదు. ఆమెలోని తెగింపు, ధైర్యం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి" అని అనీత్ చెప్పారు. ఇక ఏసీపీ జస్లీన్ గా నటించిన ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ.. "చాలా సంక్లిష్టమైన కేసులో పవర్, ప్రజల అభిప్రాయాలను దాటుకుని నిజం కోసం అన్వేషించే ఆఫీసర్‌గా నటించడం గొప్ప అనుభం" అని అన్నారు.

సెప్టెంబర్ 25న ఓటీటీలో స్ట్రీమింగ్

సెప్టెంబర్ 25న జియోహాట్‌స్టార్‌లో ఈ హై-వోల్టేజ్ సోషియో డ్రామా స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్, కోర్ట్‌రూమ్ థ్రిల్లర్స్ బాగా ఆదరించే ఓటీటీ ఆడియన్స్‌కు 'హుంకార్' పర్ఫెక్ట్ విందుగా మారనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks