Pavala Syamala: వెండితెరపై వందలాది సినిమాల్లో తనదైన నటనతో, హాస్యంతో ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ సహాయ నటి పావలా శ్యామల జీవితం అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమె పరిస్థితి ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారింది.

శుక్రవారం (మే 15) రాత్రి ఆమెకు గుండె సంబంధిత సమస్య తీవ్రమవడంతో చికిత్స కోసం కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే చేతిలో తగినంత డబ్బు లేదనే కారణంతో సదరు ఆస్పత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించిందని ఆరోపణలు వస్తున్నాయి.
హాస్పిటల్ నిర్వాకం.. క్యాబ్ డ్రైవర్ అమానుషం
కనీసం మానవత్వం కూడా చూపకుండా ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చికిత్స అందించకపోగా పావలా శ్యామలను అక్కడి నుంచి పంపించివేశారు. ఆ తర్వాత మరింత అమానుషమైన ఘటన జరిగింది.
ఒక క్యాబ్ డ్రైవర్ ఆమెను అర్ధరాత్రి సమయంలో కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. కదలలేని స్థితిలో, తీవ్రమైన గుండె నొప్పితో బిక్కుబిక్కుమంటూ నడిరోడ్డుపై పడి ఉన్న ఆమెను చూసి స్థానికులు చలించిపోయారు.
రంగంలోకి పోలీసులు
వెంటనే స్పందించిన స్థానికులు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పావలా శ్యామల పరిస్థితిని గమనించారు. మానవత్వంతో స్పందించిన పోలీసులు ఆమెకు తక్షణ రక్షణ కల్పించి, సురక్షితంగా ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమానికి తరలించారు. ప్రస్తుతం ఆమెను సనత్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
స్టార్ నటికి ఇంత దారుణమైన పరిస్థితులా?
టాలీవుడ్ లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి, ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఒక సీనియర్ నటి నడిరోడ్డుపై పడి ఉండటం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం అందించినప్పటికీ, శాశ్వత జీవనాధారం లేకపోవడం, నిరంతరం వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో ఆమె, ఆమె కుమార్తె ఇద్దరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.
{{/usCountry}}టాలీవుడ్ లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి, ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఒక సీనియర్ నటి నడిరోడ్డుపై పడి ఉండటం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం అందించినప్పటికీ, శాశ్వత జీవనాధారం లేకపోవడం, నిరంతరం వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో ఆమె, ఆమె కుమార్తె ఇద్దరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.
{{/usCountry}}ఈ దారుణ పరిస్థితిపై స్పందించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)తో పాటు చిత్ర పరిశ్రమ పెద్దలు ఆమెకు శాశ్వత ప్రాతిపదికన వైద్య సహాయం అందించాలని అభిమానులు, సినిమా ప్రేక్షకులు కోరుతున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: నటి పావలా శ్యామల ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఆమె ఆరోగ్యం ఎలా ఉంది?
జవాబు: కూకట్‌పల్లి ఫుట్‌పాత్‌పై కనిపించిన పావలా శ్యామలను పోలీసులు, ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులు కాపాడారు. ప్రస్తుతం ఆమెను సనత్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు. ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.
ప్రశ్న: పావలా శ్యామలను ప్రైవేట్ ఆస్పత్రి ఆమెను ఎందుకు చేర్చుకోలేదు?
జవాబు: శుక్రవారం రాత్రి గుండె నొప్పితో కూకట్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన పావలా శ్యామల వద్ద చికిత్సకు అవసరమైన డబ్బు లేకపోవడంతో ఆస్పత్రి నిర్వాహకులు ఆమెకు అడ్మిషన్ నిరాకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రశ్న: పావలా శ్యామలకు గతంలో ఎవరైనా ఆర్థిక సహాయం చేశారా?
జవాబు: అవును.. గతంలో ఆమె దయనీయ స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించారు. అలాగే నటుడు కాదంబరి కిరణ్ తన 'మనం ఫౌండేషన్' తరఫున రూ. 25 వేల ఆర్థిక సాయం అందించారు. అయినప్పటికీ నిరంతర అనారోగ్య సమస్యల వల్ల ఆమె ఆర్థిక పరిస్థితి మళ్లీ దెబ్బతింది.