Radha Case: 1980ల నాటి సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలిన సీనియర్ హీరోయిన్ రాధ, తన సొంత అక్క అంబిక తో పాటు సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌పై ఏకంగా రూ. 46 కోట్ల ఫోర్జరీ ఫిర్యాదుతో చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ మెట్లు ఎక్కారు. తన రూమ్‌లోని సంతకం చేసిన ఖాళీ చెక్కులను దొంగిలించి, భారీ మొత్తానికి డ్రా చేయడానికి ట్రై చేశారంటూ రాధ చేసిన ఆరోపణలు ఇప్పుడు చెన్నైతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద షాక్ ఇచ్చాయి.
ఐడీబీఐ బ్యాంక్ చెక్కుల డ్రామా..

రాధ తన బిజినెస్ మెయింటెనెన్స్ కోసం ఐడీబీఐ బ్యాంక్‌లో కరెంట్ అకౌంట్ నిర్వహించేవారు. మొదట్లో 'ఏఆర్‌ఎస్ గార్డెన్ స్టూడియో' పేరుతో ఉన్న ఈ బిజినెస్, 2025 జనవరిలో 'ఆర్‌ఆర్ గార్డెన్స్'గా మారింది.
ఆమె షూటింగ్‌లు, అవుట్‌డోర్ ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు కరెంట్ బిల్లులు, వర్కర్స్ జీతాలు, గార్డెనింగ్ ఖర్చుల కోసం కొన్ని ఖాళీ చెక్కులపై ముందే సంతకాలు చేసి చెన్నైలోని తన రూమ్‌లో భద్రపరిచారు. కొత్త చెక్ బుక్ వచ్చాక ఆ పాత పుస్తకాన్ని రాధ తన రూమ్‌లోనే మరిచిపోయారు.
సెప్టెంబర్ 17న బ్యాంక్ అధికారుల నుంచి రాధకు ఒక కాల్ వచ్చింది. ఆమె పాత చెక్ బుక్ నుంచి 5 ఖాళీ చెక్కులను అంబిక పేరు మీద రూ. 46 కోట్లకు క్లెయిమ్ చేస్తూ ప్రెజెంట్ చేసినట్లు బ్యాంకర్లు చెప్పారు. దీంతో షాక్ తిన్న రాధ వెంటనే ఆ చెక్కుల పేమెంట్ నిలిపివేయాలని 'స్టాప్ పేమెంట్' ఆర్డర్స్ ఇచ్చారు. తాను అంబికకు ఎలాంటి చెక్కులు ఇవ్వలేదని, ఆమెతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు.
సోదరుడు మల్లికార్జున హస్తం..
ఈ ఖాళీ చెక్కులపై ఉన్న వివరాలన్నీ తన సోదరుడు మల్లికార్జున నింపారని, అక్క అంబికతో కలిసి తనను మోసం చేయడానికి ప్లాన్ చేశారని రాధ పోలీస్ కంప్లైంట్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. తాను చెన్నైలో లేని టైమ్‌లో తన రూమ్‌లోకి అక్రమంగా ప్రవేశించి ఈ చెక్కులు తీసుకున్నారని పేర్కొన్నారు.
అంతేకాకుండా గడచిన ఏడాదిన్నరగా కుటుంబ ఆస్తిలోకి తను వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, అందులోనే తన విలువైన బంగారు నగలతో పాటు ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఉండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను కోరారు.
80ల సౌత్ సినీ చరిత్ర.. రాధా, అంబికల రేర్ కంబ్యాక్ రికార్డ్స్
{{/usCountry}}అంతేకాకుండా గడచిన ఏడాదిన్నరగా కుటుంబ ఆస్తిలోకి తను వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, అందులోనే తన విలువైన బంగారు నగలతో పాటు ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఉండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను కోరారు.
80ల సౌత్ సినీ చరిత్ర.. రాధా, అంబికల రేర్ కంబ్యాక్ రికార్డ్స్
{{/usCountry}}దర్శకుడు భారతీరాజా తెరెకెక్కించిన 'అలైగల్ ఓయ్వాతిల్లై' (1981) సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన రాధ.. అతితక్కువ కాలంలోనే తమిళం, తెలుగు భాషల్లో టాప్ స్టార్ హీరోయిన్‌గా మారారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కమల్ హాసన్, రజనీకాంత్, అక్కినేని నాగార్జున వంటి దిగ్గజ హీరోల సరసన బ్లాక్‌బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు.
ఆమె అక్క అంబిక కూడా మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. వీరిద్దరూ కలిసి 'ఎంకేయో కేట్ట కురల్', 'వెళ్లై రోజా', 'ఇదయ కోవిల్', 'మనాకణక్కు', 'కాదల్ పరిసు', 'అణ్ణానగర్ ముదల్ తేరు' వంటి పాపులర్ సినిమాల్లో అక్కాచెల్లెళ్లుగా నటించి ఆడియన్స్‌ను అలరించారు. ఒకే ఇంట పుట్టి సౌత్ ఇండస్ట్రీని ఏలిన ఈ స్టార్ సిస్టర్స్ మధ్య కోట్లాది రూపాయల ఆస్తి తగాదాలు రావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.