Top 10 Actors: తిరుగులేని రెబల్ స్టార్.. ఇండియాలో నంబర్ వన్ హీరో.. టాప్ 10లో నలుగురు తెలుగు స్టార్లే.. వాళ్లెవరంటే?

Top 10 Actors: ఇండియాలో టాప్ 10 హీరోలు ఎవరో తెలుసా? తాజాగా ఆగస్టు నెలకుగాను ఆర్మాక్స్ మీడియా ఈ రిపోర్టును వెల్లడించింది. ఇందులో ప్రభాస్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. టాప్ 10లో ఏకంగా నలుగురు తెలుగు స్టార్లు ఉన్నారు.

Published on: Sep 22, 2026, 16:39:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Top 10 Actors: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌ని వెనక్కి నెట్టి దేశంలోనే మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్‌గా టాప్ చార్ట్స్‌లో నిలిచారు. ప్రముఖ మీడియా రీసెర్చ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా ఆగస్ట్ 2026 నెలకు సంబంధించి ఇండియాస్ మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్స్ టాప్ 10 లిస్ట్ విడుదల చేసింది. ఈ క్రేజీ జాబితాలో సౌత్ ఇండియన్ స్టార్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. అందులోనూ నలుగురు తెలుగు హీరోలే కావడం విశేషం.

Top 10 Actors: తిరుగులేని రెబల్ స్టార్.. ఇండియాలో నంబర్ వన్ హీరో.. టాప్ 10లో నలుగురు తెలుగు స్టార్లే.. వాళ్లెవరంటే?
Top 10 Actors: తిరుగులేని రెబల్ స్టార్.. ఇండియాలో నంబర్ వన్ హీరో.. టాప్ 10లో నలుగురు తెలుగు స్టార్లే.. వాళ్లెవరంటే?

చివరి 3 స్థానాల్లో షాకింగ్ పేర్లు.. వెనకబడిన రణ్‌వీర్, చరణ్

ఈ జాబితాలో చివరి స్థానాల్లో ఉన్న స్టార్ల పేర్లు అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రీసెంట్‌గా 'ధురంధర్', 'ధురంధర్ 2' చిత్రాలతో రికార్డు బ్రేకింగ్ బాక్సాఫీస్ హిట్లు కొట్టిన బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఈ లిస్ట్‌లో 10వ స్థానానికి పరిమితమయ్యారు.

గ్లోబల్ హిట్ 'RRR' తర్వాత పెద్దితో గొప్ప కంబ్యాక్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 9వ స్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తన అప్‌కమింగ్ మూవీ 'మాతృభూమి' కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా ఈ చార్ట్‌లో 8వ ప్లేస్‌లోనే నిలవడం గమనార్హం.

ఆర్మాక్స్ మీడియా టాప్ 10

Rank 01 : ప్రభాస్

Rank 02 : షారుఖ్ ఖాన్

Rank 03 : దళపతి విజయ్

Rank 04 : అల్లు అర్జున్

Rank 05 : మహేష్ బాబు

Rank 06 : సూర్య

Rank 07 : యశ్

Rank 08 : సల్మాన్ ఖాన్

Rank 09 : రామ్ చరణ్

Rank 10 : రణ్‌వీర్ సింగ్

టాప్ 3 రేసులో మహేష్ బాబు, అల్లు అర్జున్, యశ్

టాప్ 3లోకి దూసుకెళ్లలేకపోయిన మరికొందరు బిగ్ స్టార్ల విషయానికి వస్తే.. 'టాక్సిక్' మూవీతో వార్తల్లో నిలిచి ప్రస్తుతం 'రామాయణ'లో రావణుడి పాత్ర పోషిస్తున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్ 7వ స్థానంలో ఉన్నారు. తమిళ స్టార్ యాక్టర్ సూర్య 6వ స్థానాన్ని దక్కించుకోగా, దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళితో కలిసి ప్రతిష్టాత్మక 'వారణాసి' ప్రాజెక్ట్ చేస్తున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు 5వ స్థానంలో స్థిరపడ్డారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 4వ స్థానంలో నిలిచారు. 'పుష్ప 2' భారీ సక్సెస్ తర్వాత స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి చేస్తోన్న వరల్డ్ క్లాస్ బిగ్ ప్రాజెక్ట్ 'రాకా' కి సంబంధించిన బజ్ తో అల్లు అర్జున్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. ఇప్పటివరకు కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ అయినా కూడా 'రాకా' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

నంబర్ 1 పీఠంపై రెబల్ స్టార్ ప్రభాస్ రాజసం

ఇక టాప్ 3 మోస్ట్ పాపులర్ స్టార్ల కేటగిరీ చూస్తే, ఇటీవల సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ తన పొలిటికల్ మూవీ 'జన నాయగన్' వర్క్‌తో 3వ స్థానంలో నిలిచారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన అప్‌కమింగ్ మూవీ 'కింగ్' ఇంకా రిలీజ్ కాకపోయినా తనకున్న నేషనల్ క్రేజ్‌తో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

అయితే వీరందరినీ దాటుకుని రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని ఇండియన్ బాక్సాఫీస్ రియల్ కింగ్‌గా నిలిచారు. వరసగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రభాస్, బాలీవుడ్ స్టార్స్‌ను దాటుకుని అగ్రపీఠం దక్కించుకోవడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More