Rajesh Sharma: ప్రభాస్ తప్పేమీ లేదు.. వాళ్లంతా చాలా మంచోళ్లు.. అవన్నీ తప్పుడు వార్తలు: ఫౌజీ మూవీ యాక్టర్ రాజేష్ శర్మ

Rajesh Sharma: ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ లో ఏదో విష పురుగు కుట్టడం వల్ల హాస్పిటల్ పాలయ్యాడంటూ వస్తున్న వార్తలను నటుడు రాజేష్ శర్మ ఖండించాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో అతడు వివరించాడు.

Published on: Sep 8, 2026, 13:58:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rajesh Sharma: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'ఫౌజీ' (Fauzi) షూటింగ్ సెట్‌లో విలక్షణ నటుడు రాజేష్ శర్మకు విష పురుగు కుట్టి ఆసుపత్రి పాలయ్యారంటూ ఇటీవల వైరల్ అయిన వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ షూటింగ్ సెట్‌లో తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, విష పురుగు కుట్టడం వల్లే ఆసుపత్రిలో చేరాననే వార్తల్లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

Rajesh Sharma: ప్రభాస్ తప్పేమీ లేదు.. వాళ్లంతా చాలా మంచోళ్లు.. అవన్నీ తప్పుడు వార్తలు: ఫౌజీ మూవీ యాక్టర్ రాజేష్ శర్మ
Rajesh Sharma: ప్రభాస్ తప్పేమీ లేదు.. వాళ్లంతా చాలా మంచోళ్లు.. అవన్నీ తప్పుడు వార్తలు: ఫౌజీ మూవీ యాక్టర్ రాజేష్ శర్మ

అసలు ఆసుపత్రిలో ఎందుకు చేరాల్సి వచ్చింది?

ఇటీవల ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో రాజేష్ శర్మ తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా పంచుకున్నారు. తను చాలా కాలంగా కుడి కాలికైన తీవ్రమైన చర్మ సమస్యతో (Skin Infection) బాధపడుతున్నట్లు తెలిపారు.

ఆ సమయంలో తనకు షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండటం, దాన్ని ప్రారంభంలో సరైన విధంగా పట్టించుకోకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ కాస్త తీవ్రరూపం దాల్చిందని చెప్పారు. ప్రస్తుతం కోల్ కతాలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పూర్తయిందని, త్వరలోనే డిశ్చార్జ్ అయి వారం రోజుల్లో తిరిగి షూటింగ్‌లలో పాల్గొంటానని ధీమా వ్యక్తం చేశారు.

"ప్రభాస్ టీమ్‌కు దీనితో సంబంధం లేదు!"

హైదరాబాద్‌లో ప్రభాస్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తాను కోల్ కతా వెళ్లిన తర్వాతే పరిస్థితి దారుణంగా మారిందని రాజేష్ శర్మ తెలిపారు. విషపు పురుగు కుట్టిందంటూ తన స్నేహితురాలు, నటి సుదీప ఛటర్జీ ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ పై స్పందిస్తూ.. ఆమె ఆందోళనతోనే ఆ పోస్ట్ పెట్టినప్పటికీ, ఆమెకు తప్పుడు సమాచారం అందిందని చెప్పారు.

ప్రభాస్ కానీ, ఆయన మూవీ ప్రొడక్షన్ యూనిట్ కానీ ఎవరూ ఈ విషయానికి బాధ్యులు కారని, వాళ్లంతా చాలా మంచివాళ్లని స్పష్టం చేశారు. అనవసరంగా ఈ విషయంలో ప్రభాస్ టీమ్‌ను నిందించవద్దని కోరారు.

ప్రభాస్ 'ఫౌజీ', రాజేష్ శర్మ 'హైవాన్' అప్‌డేట్స్

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీనితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న 'స్పిరిట్' మూవీకి కూడా ప్రభాస్ లైన్ అప్ సిద్ధం చేస్తున్నారు. ఫౌజీ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. స్పిరిట్ వచ్చే ఏడాది రానుంది. ఫౌజీలో ప్రభాస్ సరసన ఇమాన్వి, స్పిరిట్ లో తృప్తి డిమ్రి ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు.

ఇక రాజేష్ శర్మ విషయానికి వస్తే, ఆయన నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'హైవాన్' సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, సయామీ ఖేర్ ముఖ్య పాత్రల్లో నటించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More