...
...
Next Story

Toxic Youtuber: యశ్ బయట కూడా మగాడనుకున్నా: టాక్సిక్ నెగటివ్ రివ్యూకి లీగల్ నోటీసులు అందుకున్న యూట్యూబర్ కామెంట్స్

Toxic Youtuber: టాక్సిక్ సినిమాకు నెగటివ్ రివ్యూలు ఇచ్చిన యూట్యూబర్లకు లీగల్ నోటీసులు అందుతూనే ఉన్నాయి. తాజాగా నోటీసులు అందుకున్న ఓ యూట్యూబర్ ఈసారి యశ్ ను కూడా ఘాటుగా విమర్శిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Published on: Aug 28, 2026, 16:16:21 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Toxic Youtuber: రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic)పై నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన యూట్యూబర్లకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. బెంగళూరు సిటీ కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఇంజంక్షన్ ఆర్డర్ ఆధారంగా సినిమా మేకర్స్ వరుసగా లీగల్ నోటీసులు పంపుతున్నారు. ఇప్పటికే ఒక యూట్యూబర్ నోటీస్ స్క్రీన్‌షాట్ షేర్ చేయగా, తాజాగా మరొక పాపులర్ యూట్యూబర్ ప్రశాంత్ రంగస్వామి కూడా తనకు లీగల్ నోటీస్ వచ్చిందని వెల్లడించడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది.

"బయట కూడా మగాడు అనుకున్నా".. ప్రశాంత్ రంగస్వామి సంచలన ట్వీట్

Toxic Youtuber: యశ్ బయట కూడా మగాడనుకున్నా: టాక్సిక్ నెగటివ్ రివ్యూకి లీగల్ నోటీసులు అందుకున్న యూట్యూబర్ కామెంట్స్
Toxic Youtuber: యశ్ బయట కూడా మగాడనుకున్నా: టాక్సిక్ నెగటివ్ రివ్యూకి లీగల్ నోటీసులు అందుకున్న యూట్యూబర్ కామెంట్స్

'టాక్సిక్' సినిమాపై 'మురుగల్ రోస్ట్' పేరుతో రివ్యూ వీడియో చేసిన పాపులర్ యూట్యూబర్, క్రిటిక్ ప్రశాంత్ రంగస్వామి ఎక్స్ వేదికగా యశ్ టీమ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "టాక్సిక్ రివ్యూ ఇచ్చినందుకు నాకు యశ్, కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి లీగల్ నోటీస్ వచ్చింది. యశ్ రియల్ లైఫ్‌లో కూడా మగాడు అనుకున్నా, కానీ తీరా చూస్తే ఈయన కూడా డబ్బు, ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న సాధారణ వ్యక్తిలాగే ప్రవర్తిస్తున్నారు" అంటూ ఘాటుగా విమర్శించారు.

అయితే ప్రశాంత్ రంగస్వామి తనకు వచ్చిన లీగల్ నోటీస్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. ప్రస్తుతం ఆయన చేసిన రివ్యూ వీడియో యూట్యూబ్‌లో అందుబాటులోనే ఉంది. అంతకుముందు సురాజ్ కుమార్ అనే మరొక యూట్యూబర్ బెంగళూరుకు చెందిన 'ఐప్లెక్స్ సాఫ్ట్‌వేర్' కంపెనీ నుంచి తనకు వచ్చిన ఈమెయిల్ నోటీస్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసి సంచలనం సృష్టించారు.

బెంగళూరు కోర్టు ఆర్డర్.. సెప్టెంబర్ 28 వరకు ఆంక్షలు

ఆగస్టు 22న బెంగళూరు కోర్టు 'టాక్సిక్' సినిమాపై ఎవరైనా తప్పుడు, ఫేక్ లేదా ప్రతిష్టను దిగజార్చే కంటెంట్ పోస్ట్ చేస్తే చర్యలు తీసుకోవచ్చని ఎక్స్-పార్టీ తాత్కాలిక ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోర్టు ఆర్డర్‌లో గుర్తుతెలియని వ్యక్తులను కూడా ప్రతివాదులుగా చేర్చడం గమనార్హం.

సినిమా రిలీజ్ వీకెండ్‌లో నెగిటివ్ టాక్ వ్యాపించకుండా అడ్డుకోవడానికి ప్రొడక్షన్ హౌస్‌లు ఇలాంటి లీగల్ దారులు తొక్కడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో తెలుగు, కన్నడ ఇండస్ట్రీలలోని పెద్ద సినిమాలు బుక్‌మైషో (BookMyShow) రివ్యూలను బ్లాక్ చేయడానికి కోర్టు ఆర్డర్లు తెచ్చుకున్నాయి.

గతంలో 'బార్‌బెల్ పిచ్ మీటింగ్స్' యూట్యూబ్ ఛానెల్ నడిపే సుశాంత్ కూడా ఇలాంటి లీగల్ నోటీసులపై గళం విప్పారు. తొలి వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్లను కాపాడుకోవడానికి ప్రొడ్యూసర్లు కాపీరైట్ స్ట్రైక్స్, లీగల్ నోటీసులను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

భారీ బడ్జెట్‌తో గ్యాంగ్‌స్టర్

గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'టాక్సిక్: ఏ ఫేరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రంలో యశ్ ద్విపాత్రాభినయం చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాను నిర్మించాయి.

కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి పవర్ ఫుల్ స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటించింది. బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్న ఈ సినిమాకు లీగల్ వివాదాలు ఏ రకంగా హెల్ప్ అవుతాయో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe