Trinadha Rao Nakkina: అబ్బా భలే ఉందిరా ఈ అమ్మాయని అనుకున్నా-ఆత్రుతతో షార్ట్ లో వెళ్లిపోయా- నర్గీస్ గురించి త్రినాథ రావు

Trinadha Rao Nakkina: టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన మరోసారి సంచలన కామెంట్లు చేశాడు. బాలీవుడ్ బ్యూటీ  నర్గీస్  ఫక్రి గురించి అతను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నర్గీస్ ను చూసేందుకు ఆత్రుతగా, షార్ట్స్ లోవెళ్లానని త్రినాథ రావు చెప్పాడు. పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. 

Published on: Jul 25, 2026, 15:32:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trinadha Rao Nakkina: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన మరోసారి ట్రెండింగ్ గా మారాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ గురించి అతను చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.

అబ్బా భలే ఉందిరా ఈ అమ్మాయని అనుకున్నా-ఆత్రుతతో షార్ట్ లో వెళ్లిపోయా- నర్గీస్ గురించి త్రినాథ రావు
అబ్బా భలే ఉందిరా ఈ అమ్మాయని అనుకున్నా-ఆత్రుతతో షార్ట్ లో వెళ్లిపోయా- నర్గీస్ గురించి త్రినాథ రావు

భలే ఉందిరా అమ్మాయి

త్రినాథ రావు దర్శకత్వం వహించిన అప్ కమింగ్ మూవీ ‘నేను రెడీ’. తాజాగా ఈ సినిమా నుంచి ‘కొంచెం కొంచెం’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంఛింగ్ ఈవెంట్లో త్రినాథ రావు క్రేజీ కామెంట్లు చేశాడు.

‘‘ఈ సాంగ్ లో నర్గీస్ కూడా చేసింది. నాకు ఇష్టమైన సినిమాల్లో రాక్ స్టార్ ఒకటి. ఆ సినిమాలో నర్గీస్ యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయ్యా. అబ్బా.. భలే ఉందిరా ఈ అమ్మాయి అని అప్పుడు అనుకునేవాణ్ని. హీరోయిన్ గా. ఆ అమ్మాయి ఎక్కడో లండన్ లో ఉంటుందని చెప్పారు. ఆ అమ్మాయితో సాంగ్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు’’ అని త్రినాథ రావు చెప్పాడు.

నర్గీస్ పేరు చెప్పా

‘‘నా సినిమాల్లో సాధారణంగా ఇలాంటి సాంగ్స్ ఉండవు. కానీ కథ డిమాండ్ చేసింది. ఈ సాంగ్ లో చేసేందుకు ఎవరైనా ఒక మంచి ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుందని మా వాళ్లు చెప్పారు. నేను నర్గీస్ పేరు చెప్పా. వెంటనే ఆ అమ్మాయికి అప్రోచ్ అయిపోయారు. నాకు ఇష్టమైన అమ్మాయి ఒప్పుకుంది అనేసరికి షాక్ అయ్యా’’ అని త్రినాథ రావు తెలిపాడు.

యంగ్ స్టార్ లా

‘‘షూట్ కు ఆ అమ్మాయి వచ్చిందనగానే ముందు నేనే వెళ్లిపోయా. ఆమెను చూడాలనే ఆత్రుత. ఎందుకంటే ఆ సినిమా (రాక్ స్టార్) అంటే అంత ఇష్టం. ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం. ఆ క్యారెక్టర్ లో అంత బాగా చేసింది. రోజూ ఫుల్ ప్యాంట్ వేసుకునేవాణ్ని. కానీ ఆ రోజు షార్ట్ వేసుకుని యంగ్ స్టార్ లా తయారై వెళ్లా’’ అని త్రినాథ రావు వెల్లడించాడు.

లండన్ ఇంగ్లీష్

‘‘నన్ను నర్గిస్ కు పరిచయం చేశారు. ఆ అమ్మాయి పూర్తిగా లండన్ ఇంగ్లీష్. మనదేమో అనకాపల్లి ఇంగ్లీష్. రెండింటికీ ట్యాలీ కాలేదు. పాపం.. ఆ అమ్మాయి ఏదో చెప్తుంది. నాకు అర్థం కాలేదు. లండన్ ఇంగ్లీష్ నాకు ఎక్కడ వస్తుంది? హవీష్ కు సూపర్ ఇంగ్లీష్ వచ్చు. ప్రతి దానికి జేబులో చేయి పట్టి స్మైల్ ఇవ్వండి చాలు అని చెప్పాడు. ఆమెతో రెండు రోజులు షూట్ చేయడం నాకు మంచి అనుభూతి’’ అని త్రినాథరావు నక్కిన పేర్కొన్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More