Trisha: తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ డే.. తిరుమలలో త్రిష.. ఈ రోజే ఎందుకు వెళ్లిందంటూ నెటిజన్ల ప్రశ్నలు.. వీడియో వైరల్

Trisha: సీనియర్ హీరోయిన్ త్రిష వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు సంబంధించిన ప్రతి విషయం ట్రెండింగ్ గా మారుతోంది. తాజాగా త్రిష తిరుమలలో కనిపించింది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. అయితే తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజే ఆమె తిరుమల రావడం చర్చనీయాంశంగా మారింది.

Published on: May 4, 2026, 08:35:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trisha: సీనియర్ హీరోయిన్ త్రిష ఇవాళ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. సెలబ్రిటీలు తిరుమలకు రావడం కామనే కదా, ఇందులో స్పెషాలిటీ ఏముందని అంటారా? ఈ రోజు తమిళనాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అంతే కాకుండా సోమవారమే (మే 4) త్రిష బర్త్ డే కూడా కావడం విశేషం.

త్రిష
త్రిష

తిరుమలలో త్రిష

త్రిష తిరుమలకు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్రిష బర్త్ డే రోజే తమిళనాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష తిరుమలకు రావడం హాట్ టాపిక్ గా మారింది. తిరుమలలో త్రిష ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఎందుకు వచ్చిందంటూ?

సెలబ్రిటీలు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం సాధారణమే. కానీ ఇవాళ త్రిష తిరుమలకు రావడం హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజే రాబోతున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ స్టార్ట్ అయింది.

విజయ్ కోసమేనా?

ఇటీవల కాలంలో తమిళనాడు స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్, త్రిష వ్యవహారం తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వీళ్ల మధ్య రిలేషన్ షిప్ ఉందనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే విజయం సాధించాలని ప్రార్థించడం కోసమే త్రిష తిరుమలకు వచ్చిందని కొంతమంది అంటున్నారు.

బర్త్ డే సందర్భంగా

ఈ రోజు త్రిష బర్త్ డే కూడా. అందుకే తన పుట్టిన రోజున శ్రీవారిని ఆమె దర్శించుకుందని, ఇందులో ఎలాంటి కారణాలు వెతకాల్సిన అవసరం లేదని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా తమిళనాడు అసెంబ్లీ 2026 ఎన్నికల రోజున త్రిష తిరుమలకు రావడం మాత్రం ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

విజయ్, త్రిష

కొంతకాలంగా దళపతి విజయ్, త్రిష మధ్య సంబంధంపై బలమైన రూమర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల తన భర్తకు వేరే హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిషనే అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

మరోవైపు సినిమాలకు గుడ్ బై చెప్పిన విజయ్.. రాజకీయ నాయకుడిగా మారాడు. టీవీకే పార్టీని స్థాపించాడు. ఈ తమిళనాడు 2026 ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేసింది. మరి తమిళనాడు ఓటర్ల మనసును విజయ్ గెలిచాడా? లేదా? అన్నది మరొకొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More