ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల.. కాంగ్రెస్ కూటమి చేతికి కేరళం, మరి తమిళనాడు?

Exit polls : ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ అంచనా వేసిన ఫలితాల ప్రకారం ఏ పార్టీ చేతికి ఏ రాష్ట్రం వెళ్తుందో చూద్దాం.

Published on: Apr 29, 2026, 19:34:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి కళ్లు ఇప్పుడు మే 4న జరగబోయే కౌంటింగ్‌పైనే ఉన్నాయి. అయితే, అంతకంటే ముందే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయ వేడిని పెంచేశాయి. ఈ అంచనాల ప్రకారం ఎక్కడ ఏ పార్టీ జెండా ఎగురవేయబోతోందో ఒకసారి లుక్కేద్దాం.

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు (gemini)
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు (gemini)

అసోం హిమంత శర్మ మ్యాజిక్!

అసోంలో బీజేపీ 'సునామీ' సృష్టించబోతోందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా సాగుతోంది. కాంగ్రెస్ కూటమి కేవలం 24-36 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది.

తమిళనాడు స్టాలిన్ హవా!

తమిళనాడులో మరోసారి డీఎంకే స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోనుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రాజకీయ అరంగేట్రం చేసిన నటుడు విజయ్ పార్టీ (TVK) 18-24 సీట్లు సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేయడం విశేషం.

పశ్చిమ బెంగాల్: దీదీ వర్సెస్ మోదీ!

బెంగాల్ కోటలో మమతా బెనర్జీ తన పట్టును నిలుపుకోనున్నట్లు కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ ప్రకారం.. 177-187 సీట్లతో టీఎంసీ ముందంజలో ఉండగా, బీజేపీ 95-110 సీట్లతో గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల తీర్పు ఇక్కడ కీలకం కానుంది.

కేరళం: యూడీఎఫ్‌కు కుర్చీ!

కేరళంలో ఎప్పటిలాగే ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే ఈసారి యూడీఎఫ్‌ (కాంగ్రెస్ కూటమి) స్వల్ప ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనాలు చెబుతున్నాయి. యూడీఎఫ్‌: 75 – 85, ఎల్‌డీఎఫ్‌: 55 – 65, బీజేపీ: 0 – 3 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

పుదుచ్చేరి: కమలం కూటమిదే అధికారం!

ఇక పుదుచ్చేరిలో ఎన్డీఏ (NRC + BJP) కూటమి అధికారాన్ని చేజిక్కించుకోనుంది. ఇక్కడ భారీగా నమోదైన 89 శాతం ఓటింగ్ ఎన్డీఏకు కలిసి రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. పీపుల్స్‌ పల్స్‌ అంచనాల ప్రకారం.. ఎన్‌ఆర్‌సీ: 16 - 19, కాంగ్రెస్‌: 10 - 12, ఇతరులు: 1 - 2 సీట్లు రానున్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More