TV Actor: ఇండియన్ టీవీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రోజువారీ సీరియల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ షోల ద్వారా లక్షలాది మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ హిందీ టీవీ నటుడు అనూజ్ ఠాకూర్ (Anuj Thakur) 33 ఏళ్ల వయస్సులోనే హఠాన్మరణం చెందారు. నిద్రపోతున్న సమయంలో ఊహించని విధంగా ఫిట్స్ (Seizure) రావడంతో ఆయన నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ విషాద వార్తను ఆయన ప్రాణస్నేహితుడు, ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ రూపేష్ సోనార్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. 'ధూమ్ మచావో ధూమ్', 'బంధన్ సాత్ జన్మో కా', 'బీంద్ బనూంగా ఘోడీ చఢూంగా', 'మహిసాగార్' వంటి హిట్ సీరియల్స్‌లో నటించి అనూజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
"ఉదయం 4:30కి అలారం మోగింది.. కానీ అతను లేవలేదు!"
అనూజ్ ఠాకూర్ ఆకస్మిక మరణం గురించి రూపేష్ సోనార్ మీడియాకు వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "శనివారం రోజున నేను అనూజ్ నివాసానికి వెళ్ళి ఆయన తల్లిని, సోదరుడిని పరామర్శించాను. వారు చెప్పిన విషయాలు విని షాక్‌కు గురయ్యాను. అనూజ్ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ప్రతీరోజూ ఉదయం 4:30 గంటలకే నిద్రలేచి వ్యాయామం, జాగింగ్ చేయడం ఆయనకు అలవాటు" అని తెలిపారు.
సంఘటన జరిగిన రోజు ఉదయం కూడా 4:30 గంటలకు అలారం మోగిందని, అయితే అనూజ్ గది నుంచి బయటకు రాకపోవడంతో ఆయన తల్లి వెళ్లి చూశారని రూపేష్ చెప్పారు. "ఆమె గదిలోకి వెళ్లేసరికి అనూజ్ స్పృహలేకుండా పడి ఉన్నారు. పరీక్షించగా నిద్రలోనే ఫిట్స్ వచ్చి ఆయన మరణించినట్లు తెలిసింది. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిన మనిషి ఉదయానికి లేవకుండా ప్రాణాలు విడవడం జీర్ణించుకోలేకపోతున్నాం" అని ఆవేదన వ్యక్తం చేశారు.
10 రోజుల క్రితమే కలుసుకున్నాం.. రీ-ఎంట్రీకి ప్లాన్ చేశాడు
తన మిత్రుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ: "2008లో 'బంధన్ సాత్ జన్మో కా' సీరియల్ సమయం నుంచి నాకు అనూజ్ తెలుసు. మేము కలిసి చాలా షోలకు పనిచేశాం. అతను నాకు తమ్ముడి లాంటివాడు. కేవలం 10 రోజుల క్రితమే మేము కలుసుకున్నాం. బుల్లితెరకు రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ఎంతో ఉత్సాహంతో ప్లాన్ చేసుకున్నాడు. ఎల్లప్పుడూ అందరితో ఎంతో మర్యాదగా, నవ్వుతూ ఉండే మంచి మనసున్న వ్యక్తిని ఇంత త్వరగా కోల్పోవడం బాధాకరం" అని పేర్కొన్నారు.
{{/usCountry}}తన మిత్రుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ: "2008లో 'బంధన్ సాత్ జన్మో కా' సీరియల్ సమయం నుంచి నాకు అనూజ్ తెలుసు. మేము కలిసి చాలా షోలకు పనిచేశాం. అతను నాకు తమ్ముడి లాంటివాడు. కేవలం 10 రోజుల క్రితమే మేము కలుసుకున్నాం. బుల్లితెరకు రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ఎంతో ఉత్సాహంతో ప్లాన్ చేసుకున్నాడు. ఎల్లప్పుడూ అందరితో ఎంతో మర్యాదగా, నవ్వుతూ ఉండే మంచి మనసున్న వ్యక్తిని ఇంత త్వరగా కోల్పోవడం బాధాకరం" అని పేర్కొన్నారు.
{{/usCountry}}అంతేకాకుండా అనూజ్ తన తల్లి, సోదరుడితో కలిసి న్యూయార్క్ పర్యటనకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, టిక్కెట్లు, వీసాలు కూడా పూర్తయిన సమయంలో ఇలా జరగడం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచివేసిందని తెలిపారు.
బుల్లితెరపై ప్రత్యేక ముద్ర
'ధూమ్ మచావో ధూమ్', 'బీంద్ బనూంగా ఘోడీ చఢూంగా', 'మహిసాగార్' వంటి ప్రజాదరణ పొందిన హిందీ సీరియళ్లలో నటించి అనూజ్ ఠాకూర్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన జులై 30న సౌతాఫ్రికా ట్రిప్ పిక్స్ షేర్ చేశారు.
అదే ఆయన చివరి సోషల్ మీడియా పోస్ట్ కావడం గమనార్హం. అనూజ్ ఠాకూర్ అకాల మరణం పట్ల పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.