Ekta Kapoor About Worst Year And Overconfidence: భారతీయ బుల్లితెర రూపురేఖలను మార్చేసి, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌పై ఎన్నో బ్లాక్‌బస్టర్ సీరియళ్లను అందించిన లేడి నిర్మాత ఏక్తా కపూర్ అంటే తెలియనివారు ఉండరు. 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ', 'కహానీ ఘర్ ఘర్ కీ' వంటి సీరియళ్లతో దశాబ్దానికి పైగా కోట్లాది మంది ప్రేక్షకులను టీవీ స్క్రీన్లకు కట్టిపడేసిన ఆమె, తన ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.

ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బుల్లితెర క్వీన్ ఏక్తా కపూర్ తన కెరీర్, మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా వేధింపుల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.
ఆర్కుట్ రోజుల్లో ఐశ్వర్య రాయ్, నాపైనే ఎక్కువ ద్వేషం!
మన దేశంలో సోషల్ మీడియా ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న రోజుల్లో తనకు ఎదురైన పరిస్థితులను ఏక్తా కపూర్ గుర్తుచేసుకున్నారు. ఆరంభంలో ఆర్కుట్ (Orkut) వేదికగా తనపై విపరీతమైన ద్వేషం (Hate Clubs) కనిపించేదని చెప్పారు. అప్పట్లో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, తన పేరు మీదనే అత్యధికంగా హేట్ క్లబ్‌లు నడిచేవని వివరించారు.
"నేను చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. నా ఆలోచనలను, అభిప్రాయాలను చాలా నిర్భయంగా చెప్పేదాన్ని. పరిశ్రమలో ఒక వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించినప్పుడు సమాజం నుంచి వ్యతిరేకత రావడం సహజం. నన్ను కిందకు లాగడానికి చాలా మంది ప్రయత్నించారు" అని ఏక్తా కపూర్ తెలిపారు.
2008లో దెబ్బతిన్న కెరీర్.. కొవిడ్ తెచ్చిన మానసిక క్షోభ!
తన ప్రయాణంలో ఎదురైన కష్టకాలం గురించి మాట్లాడుతూ, వ్యాపార పరంగా 2008 సంవత్సరం తనకు అత్యంత ఘోరమైన ఏడాది అని ఏక్తా కపూర్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఏ పని తలపెట్టినా విఫలమయ్యేదని, ప్రాజెక్టులు చేజారిపోయి తీవ్ర ఒత్తిడికి గురయ్యానని చెప్పారు.
ఇక మానసికంగా 2021-2022 కాలం నరకంలా మారిందని వెల్లడించారు. సరోగసీ ద్వారా కొడుకు పుట్టిన తర్వాత తన జీవితంలో కొత్త మార్పులు వచ్చాయని, అయితే కొవిడ్ లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండిపోవడం, చుట్టూ మరణాలను చూడటంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని చెప్పారు.
{{/usCountry}}ఇక మానసికంగా 2021-2022 కాలం నరకంలా మారిందని వెల్లడించారు. సరోగసీ ద్వారా కొడుకు పుట్టిన తర్వాత తన జీవితంలో కొత్త మార్పులు వచ్చాయని, అయితే కొవిడ్ లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండిపోవడం, చుట్టూ మరణాలను చూడటంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని చెప్పారు.
{{/usCountry}}కాన్పు తర్వాత మహిళల్లో కనిపించే 'పోస్ట్‌పార్టమ్ డెప్రెషన్' వంటి స్థితిని తాను కూడా అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. "వ్యాపార పరంగా 2008 నాకు అత్యంత దారుణమైన సంవత్సరం అయితే, మానసిక ఆరోగ్య పరంగా 2021-22 నన్ను తీవ్రంగా కుంగదీసింది" అని ఏక్తా కపూర్ తెలిపారు.
ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేసిన తప్పులు.. జీవితం నేర్పిన పాఠాలు!
తన కెరీర్ ఆరంభంలో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కొన్ని పొరపాట్లు చేశానని ఏక్తా కపూర్ ఒప్పుకున్నారు. పేపర్ వర్క్ లేకుండా, ఒప్పందాలు సరిగ్గా లేకుండా పనులు చేయడం వల్ల నష్టపోయానని చెప్పారు. కంపెనీలలో పనిచేసే ప్రొఫెషనల్స్‌పై ఎక్కువగా ఆధారపడటం, వారు విడిచివెళ్లినప్పుడు నష్టపోవడం ద్వారా పాఠాలు నేర్చుకున్నట్లు తెలిపారు.
"ఓవర్‌కాన్ఫిడెన్స్ అనేది స్టైల్ కానే కాదు, అదొక స్టుపిడిటీ. విజయం సాధించడానికి అతివిశ్వాసం అవసరం లేదు. నా వద్దకు వచ్చిన నిపుణులకు అప్పట్లో నేను సరైన గౌరవం ఇవ్వలేదు. కేవలం నేనొక్కదాన్నే బెస్ట్ కంటెంట్ ఇస్తున్నానని భావించాను. కానీ, ప్రతిభ ఉన్నవారితో కలిసి పనిచేసేటప్పుడు వినమ్రత చాలా అవసరమని ఆ తర్వాత గ్రహించాను" అని ఏక్తా కపూర్ స్పష్టం చేశారు.
మనుషులే ముఖ్యమని నేర్చుకున్నా
జీవితంలో కేవలం విజయాల కంటే మనుషులతో మంచి సంబంధాలు నిర్మించుకోవడమే ముఖ్యమని ఈ అనుభవాలు తనకు నేర్పాయని లేడి నిర్మాత ఏక్తా కపూర్ చెప్పుకొచ్చారు.