అమ్మాయిలకు అదే పెద్ద ఇన్సూరెన్స్.. కెరీరే ముందు, పెళ్లి ఆ తర్వాతే: ఉపాసన ట్వీట్, కామెంట్స్ వైరల్

అమ్మాయిలకు ఉపాసన కొణిదెల ఇచ్చిన సలహా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అమ్మాయిలు తమ అండాలను దాచి పెట్టాలని, అదే పెద్ద ఇన్సూరెన్స్ అని అనడం విశేషం. కెరీర్ ముందు, తర్వాతే పెళ్లి అనే ఆమె సలహాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Published on: Nov 18, 2025, 16:04:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రామ్ చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు అయిన ఉపాసన కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఐఐటీ హైదరాబాద్ కు వెళ్లిన ఆమె.. అక్కడి అమ్మాయిలకు ఇచ్చిన సలహాపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ముందు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.

అమ్మాయిలకు అదే పెద్ద ఇన్సూరెన్స్.. కెరీరే ముందు, పెళ్లి ఆ తర్వాతే: ఉపాసన ట్వీట్, కామెంట్స్ వైరల్
అమ్మాయిలకు అదే పెద్ద ఇన్సూరెన్స్.. కెరీరే ముందు, పెళ్లి ఆ తర్వాతే: ఉపాసన ట్వీట్, కామెంట్స్ వైరల్

అమ్మాయిలు కెరీర్‌పైనే ఫోకస్

ఉపాసన సోమవారం (నవంబర్ 17) హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ కు వెళ్లి అక్కడి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది. “ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్ తో మాట్లాడటం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మీలో ఎంత మంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని నేను అడిగినప్పుడు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ మంది చేతులు లేపారు.

అమ్మాయిలు కెరీర్ పైనే దృష్టి సారించినట్లు అనిపించింది. ఇది సరికొత్త ప్రోగ్రెసివ్ ఇండియా. మీ విజన్ సెట్ చేసుకోండి.. మీ గోల్స్ ను నిర్ధారించుకోండి. మీరు మీలా ఉండండి. మీకు మీరు అన్‌స్టాపబుల్ గా ఉండండి” అని ఉపాసన ట్వీట్ చేసింది. దీనికి యాడ్ చేసిన వీడియో ఆసక్తి రేపింది.

అండాలను సేవ్ చేసుకోండి

ఈ వీడియోలో ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్ ను ఉద్దేశించి ఉపాసన మాట్లాడటం చూడొచ్చు. ఈ సందర్భంగా అమ్మాయిలకు అతి పెద్ద ఇన్సూరెన్స్ వాళ్ల ఎగ్స్ (అండాలు)ను సేవ్ చేసి పెట్టుకోవడమే అని, దీనివల్ల మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలను కనాలన్నది మీ చేతుల్లోనే ఉంటుందని, ముందు ఆర్థికంగా స్వతంత్రంగా మారిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని సూచించింది. తాను కూడా అలాగే చేసినట్లు చెప్పింది.

అందుకే తన జీవితంలో తాను కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగానని తెలిపింది. 30 ఏళ్లు లోపే గోల్స్ సిద్ధం చేసుకోవాలని, కెరీర్ పాత్ రెడీగా ఉండాలని స్పష్టం చేసింది. కెరీర్లో ఏ వయసులో ఎంత సంపాదించాలో కూడా ముందే టార్గెట్ గా పెట్టుకోవాలని సూచించింది.

అయితే ఉపాసన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం రెండోసారి గర్భవతి అయిన ఉపాసన.. అమ్మాయిలు పెళ్లి పక్కన పెట్టి కెరీర్ పై దృష్టిసారించాలనడం కొందరికి నచ్చలేదు. దీనివల్లే ప్రెగ్నెన్సీలో సమస్యలు అని కొందరు అనగా.. ఈ కాలం అమ్మాయిలు అటు కెరీర్, ఇటు ఫ్యామిలీ రెండింటినీ బాగానే చూసుకుంటున్నారని అన్నారు. మరికొందరు మాత్రం ఉపాసనను సమర్థిస్తూ కామెంట్స్ చేశారు. అమ్మాయిలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More