ఒక్కరు కాదు ట్విన్స్.. కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. కన్ఫామ్ చేసిన తల్లి శోభన.. మెగా ఫ్యామిలీలో డబుల్ హ్యాపీనెస్
ఉపాసన, రామ్ చరణ్ రెండో సారి తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఉపాసన ట్విన్స్ కు జన్మనివ్వబోతుందనే విషయం మెగా ఫ్యాన్స్ డబుల్ ఆనందాన్ని అందిస్తోంది. ఈ విషయాన్ని ఉపాసన తల్లి శోభన కన్ఫామ్ చేశారు.
మెగా ఫ్యామిలీకి, ఫ్యాన్స్ కు డబుల్ సంతోషాన్నిచ్చే వార్త ఇది. రామ్ చరణ్, ఉపాసన రెండో సారి తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఉపాసన ట్విన్స్ కు జన్మినవ్వబోతుందనే వార్త స్పెషల్ గా మారింది. ఈ విషయాన్ని ఉపాసన తల్లి శోభన కామినేని కన్ఫామ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

డబుల్ ధమాకా
‘‘దీపావళి డబుల్ ధమాకాగా వచ్చింది. నేను, అనిల్ వచ్చే ఏడాది ఉపాసన-రామ్ చరణ్ ట్విన్స్ పిల్లలకు వెల్ కమ్ చెప్పబోతున్నాం. త్వరలోనే అయిదుగురు గ్రాండ్ చిల్డ్రన్ ఉండబోతున్నారనే ఆలోచన నా ఆనందకరమైన సమయాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చింది’’ అని శోభన కామినేని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ గా మారింది.
ఉపాసన్ పోస్ట్
గురువారం (అక్టోబర్ 24) ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. దీపావళి రోజు హైదరాబాద్‌లో జరిగిన తన సీమంతం (బేబీ షవర్) వేడుకకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. తనకు కవలలు పుట్టబోతున్నారని హింట్ ఇచ్చారు. ఈ దంపతులకు త్వరలో కవలలు పుట్టబోతున్నారని రామ్ చరణ్ టీమ్ ధృవీకరించింది. ఉపాసన తన బేబీ షవర్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో కుటుంబ సభ్యులైన నాగబాబు, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలతో పాటు నయనతార, వెంకటేష్, నాగార్జున వంటి స్నేహితులు కూడా ఆమెను ఆశీర్వదించడం కనిపించింది.
ఈ వీడియోను షేర్ చేస్తూ 'ఈ దీపావళి రెట్టింపు వేడుకలు, రెట్టింపు ప్రేమ, రెట్టింపు ఆశీర్వాదాలతో నిండిపోయింది' అని ఉపాసన రాశారు. ఆ వీడియో రెండు పాదముద్రలతో ముగిసింది. ఇది ఆమెకు కవలలు పుట్టబోతున్నారని సూచిస్తుంది. ఈ పోస్ట్‌లో ఉపాసన మరే ఇతర వివరాలు వెల్లడించనప్పటికీ, ఈ జంట కవలల కోసం ఎదురుచూస్తున్నారని రామ్ టీమ్ ధృవీకరించింది.
సెలబ్రిటీల రియాక్షన్
ఉపాసన ప్రెగ్నెన్సీ విషయంపై సెలబ్రిటీల రియాక్షన్ వైరల్ గా మారింది. కాజల్ అగర్వాల్ స్పందిస్తూ 'అమ్మ, నాన్నలకు పెద్ద అభినందనలు, ఎంతో ప్రేమ. పెద్ద సోదరి క్లీంకారాకు అభినందనలు' అని కామెంట్ చేశారు. లక్ష్మీ మంచు రాస్తూ 'ఓ మై గాడ్ మీ ఇద్దరి గురించి నాకు చాలా సంతోషంగా ఉంది! మీకు అత్యంత అందమైన, ఆనందకరమైన ప్రెగ్నెన్సీ జరగాలని కోరుకుంటున్నాను! చిన్నారిని కలవడానికి వేచి ఉండలేను!' అని అన్నారు.
సాయి ధరమ్ తేజ్ ఎక్స్ లో రాస్తూ 'మా దీపావళి వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చిన క్షణాలు.. ఉప్సీ (ఉపాసన కొణిదెల)పై రెట్టింపు ప్రేమను కురిపించాం. కంగ్రాట్స్ చరణ్. చాలా సంతోషకరమైన వార్త' అని పోస్ట్ చేశారు. మంచు మనోజ్ కూడా 'మరో ఆనందాల మూట...! రెట్టింపు ప్రేమ, అల్లరి, క్రేజీనెస్ మీ దారిలో వస్తున్నాయి మిత్రమా. ఈ స్వీట్ కపుల్ కు అభినందనలు' అని రాశారు. రామ్, ఉపాసన 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి 2023లో మొదటి సంతానంగా క్లీం కారా జన్మించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


