Toxic Movie: ఈ చెత్త సినిమా కంటే నీ కబ్జా చాలా బెటర్.. పబ్‌జీ యాక్షన్ సీన్లు పెడతారా?: ఉపేంద్రకు ఫ్యాన్స్ క్లాస్
Toxic Movie: టాక్సిక్ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను ఏకి పారేస్తున్నారు అభిమానులు. ఇలాంటి చెత్త సినిమాలను పొగడటం ఆపేయాలని, ఈ మూవీ కంటే నీ కబ్జా మూవీ కూడా చాలా బెటర్ అని కొందరు అనడం గమనార్హం.
Toxic Movie: రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్' (Toxic) థియేటర్లలో తీవ్రమైన మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. ఈ సినిమా చూసిన శాండల్‌వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra) చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, నెటిజన్లు మాత్రం ఆయనను దారుణంగా ఏకిపారేస్తున్నారు.

"కొత్త ప్రపంచం.. కొత్త అనుభూతి": ఉపేంద్ర ట్వీట్ వైరల్
డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ తెరకెక్కించిన 'టాక్సిక్' సినిమాపై కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఎక్స్ వేదికగా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తన రివ్యూ షేర్ చేశారు. "టాక్సిక్ ఒక ఫేరీ టేల్.. కానీ పెద్దల కోసం! వావ్.. ఏం సినిమా ఇది. ఒక కొత్త ప్రపంచం, పూర్తిగా సరికొత్త అనుభూతి. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కష్టం, డెడికేషన్ నిజంగా అభినందనీయం. యశ్ టీమ్‌కు హ్యాట్సాఫ్" అంటూ ఉపేంద్ర రాసుకొచ్చారు.
దర్శకుడు ఆర్. చంద్రు కూడా కన్నడిగులంతా యశ్ కి, 'టాక్సిక్' సినిమాకు సపోర్ట్‌గా నిలవాలని కోరిన మరుసటి రోజే ఉపేంద్ర నుంచి ఈ సంచలన పోస్ట్ రావడం విశేషం.
"ఏం సినిమా చూసి రివ్యూ ఇచ్చావ్ సామీ?" - నెటిజన్ల ఫైర్
ఉపేంద్ర రివ్యూ చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. చెత్త సినిమాలను ప్రమోట్ చేయడం ఆపాలంటూ కామెంట్స్ సెక్షన్‌లో కౌంటర్లు వేస్తున్నారు.
"మీరు చూసిన ప్రింట్ ఏంటో ప్రొడక్షన్ హౌస్‌కి చెప్పి మాకూ అదే డిస్ట్రిబ్యూట్ చేయించండి సామీ.. మేము చూసిన సినిమాలో అసలు కథే లేదు!" అని ఒక నెటిజన్ ఎద్దేవా చేయగా, "కేవలం రిచ్ విజువల్స్, పబ్‌జీ (PUBG) లెవెల్ యాక్షన్ సీన్లు ఉంటే సరిపోదు.. కనీస కథ కూడా లేని సినిమాను ఎలా మెచ్చుకుంటున్నారు?" అని మరో యూజర్ ప్రశ్నించారు.
కన్నడ సినిమాను సపోర్ట్ చేయడంలో తప్పు లేదు కానీ, నాసిరకం సినిమాలను నెత్తిన పెట్టుకుంటే ఇండస్ట్రీ ఎప్పటికీ మారదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు తీసిన కబ్జా మూవీ కూడా ఈ చెత్త సినిమా కంటే బెటర్ అంటూ మరో యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.
ఉపేంద్ర సైకలాజికల్ స్టైల్‌కే సెట్ అవుతుందా?
అయితే కొందరు నెటిజన్లు ఉపేంద్ర ట్వీట్‌కు మద్దతుగా కూడా కామెంట్స్ చేశారు. ఉపేంద్ర గతంలో తీసిన 'ఓం', 'ఉపేంద్ర', 'సూపర్' లాంటి మైండ్ గేమ్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల మేకింగ్ స్టైల్‌కి ఈ 'టాక్సిక్' కాన్సెప్ట్ దగ్గరగా ఉండటం వల్లే ఆయనకు నచ్చి ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు.
"ఈ తరహా సైకలాజికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఉపేంద్ర డైరెక్ట్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది" అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
రూ.190 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర నిలుస్తుందా?
భారీ అంచనాల నడుమ విడుదలై విమర్శకుల నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. 'టాక్సిక్' మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 190 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా లాంటి భారీ తారాగణంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


