Ustaad Bhagat Singh Losses: ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్.. 100 కోట్ల మార్క్ కూడా అందుకోలేక.. పవన్‌ సినిమాకు భారీ నష్టాలు

Ustaad Bhagat Singh Losses: భారీ అంచనాల మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీసం రూ. 100 కోట్ల మార్కును కూడా దాటలేకపోయిన ఈ మూవీ.. దాదాపు రూ. 80 కోట్ల మేర నష్టాలను మిగిల్చినట్లు పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

Published on: Apr 3, 2026, 20:32:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ustaad Bhagat Singh Losses: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) థియేట్రికల్ రన్ అత్యంత నిరాశాజనకంగా ముగిసింది. 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Ustaad Bhagat Singh Losses: ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్.. 100 కోట్ల మార్క్ కూడా అందుకోలేక.. పవన్‌ సినిమాకు భారీ నష్టాలు
Ustaad Bhagat Singh Losses: ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్.. 100 కోట్ల మార్క్ కూడా అందుకోలేక.. పవన్‌ సినిమాకు భారీ నష్టాలు

అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా పూర్తిగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద కనీస ప్రభావం చూపలేక ఈ సినిమా ఒక భారీ 'డిజాస్టర్'గా మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమా కనీసం రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును కూడా చేరుకోలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

హరీష్ శంకర్ మార్క్ మిస్సయ్యింది..

దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సోషల్ మీడియాలోనూ, బయట కూడా భారీగా ప్రమోషన్లు నిర్వహించారు. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాలో కంటెంట్ లేకపోవడం, కథలో పస లేకపోవడం వల్ల మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చింది.

సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే ఓపెనింగ్స్ ఈ చిత్రానికి లభించినప్పటికీ, పేలవమైన స్క్రీన్ ప్లే, సాగదీసిన సన్నివేశాల వల్ల సాధారణ ప్రేక్షకులనే కాకుండా, మెగా అభిమానులను కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఐఎండీబీలోనూ కేవలం 5 రేటింగ్ మాత్రమే వచ్చింది.

Sacnilk ప్రకారం ఈ మూవీ 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.95.73 కోట్లు మాత్రమే వసూలు చేసింది. వీటిలో ఇండియా గ్రాస్ రూ.83.88 కోట్లు కాగా.. నెట్ వసూళ్లు రూ.71.41 కోట్లుగా ఉన్నాయి. తొలి రోజు రూ.34 కోట్లకుపైగా నెట్ వసూళ్లతో మంచి ఓపెనింగ్స్ సాధించినా.. రెండో రోజే అది రూ.9 కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత ఇక మూవీ కోలుకోలేకపోయింది.

రూ. 80 కోట్ల భారీ నష్టాలు

ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా వల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో నష్టాలు వాటిల్లాయి. సుమారు రూ. 80 కోట్ల మేర నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పవచ్చు. భారీ రేట్లకు థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు గందరగోళంలో పడ్డారు.

సినిమా మేకింగ్‌లో ఆలస్యం జరగడం, షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడం కూడా సినిమా అవుట్‌పుట్‌పై ప్రభావం చూపాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓజీతో కెరీర్లోనే అతిపెద్ద హిట్ అందుకున్న పవన్.. ఆ వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో డిజాస్టర్ ఇవ్వడం మింగుడుపడనిదే. ఈ నేపథ్యంలో అతని తర్వాతి అడుగులు ఎలా ఉంటాయన్నది చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వసూళ్లు ఎంత?

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా సాధించలేకపోయింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

2. ఈ సినిమా వల్ల ఎంత మేర నష్టం వాటిల్లింది?

ట్రేడ్ అంచనాల ప్రకారం, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు సుమారు రూ. 80 కోట్ల మేర నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది.

3. సినిమా పరాజయానికి ప్రధాన కారణాలేమిటి?

బలహీనమైన కథాంశం, పేలవమైన స్క్రీన్ ప్లే, ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవడం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More