OTT Crime Thriller: ఓటీటీలోకి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 8.2 ఐఎండీబీ రేటింగ్.. ఇక్కడ చూడండి

OTT Crime Thriller: మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్. ఓటీటీలోకి ఉయిర్ అనే మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. జియోహాట్‌స్టార్ లో ఈ సినిమా ఏకంగా ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది.

Published on: Jul 29, 2026, 21:55:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Crime Thriller: కేరళలోని కన్నూర్ జిల్లా ధర్మడం పోలీస్ స్టేషన్‌లో జరిగిన కొన్ని షాకింగ్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్' (Uyir) డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఆగస్టు 4 నుంచి ఈ మలయాళం కాన్సెప్ట్ మూవీ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీయోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది.

OTT Crime Thriller: ఓటీటీలోకి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 8.2 ఐఎండీబీ రేటింగ్.. ఇక్కడ చూడండి
OTT Crime Thriller: ఓటీటీలోకి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 8.2 ఐఎండీబీ రేటింగ్.. ఇక్కడ చూడండి

సస్పెన్స్, ఇంటెన్స్ డ్రామా ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి తెస్తున్నారు మేకర్స్. "కొన్ని నిజాలు ఎంత పాతిపెట్టినా బయటకు రాకుండా ఉండలేవు" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సబ్‌ఇన్‌స్పెక్టర్ అజీబ్ మిస్టరీ.. ధర్మడం పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్

కేరళలోని కన్నూర్ జిల్లాలోని ధర్మడం పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అజీబ్ (రోషన్ మాథ్యూ) అనే యంగ్ ఆఫీసర్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అతను ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఊహించని ఒక క్లిష్టమైన కేసును ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది.

ఆ కేసు విచారణ క్రమంలో బయటపడిన నిజాలు, దాని వెనుక ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులను అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్రంలో ప్రధానాంశం. నిజజీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా డైరెక్టర్ ఈ సినిమాను అత్యంత రియలిస్టిక్‌గా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో మలిచారు. ఈ ఉయిర్ మూవీకి ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉంది. ఉయిర్ అంటే తెలుగులో మనసు, జీవితం, శ్వాస అనే అర్థాలు ఉన్నాయి.

మలయాళం ఇన్వెస్టిగేషన్ మార్క్.. నెక్స్ట్ లెవెల్ థ్రిల్

సాధారణంగా మలయాళ సినీ రంగానికి రియలిస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లను డీల్ చేయడంలో ఒక స్పెషల్ మార్క్ ఉంది. గతంలో వచ్చిన 'దృశ్యం', 'అంజామ్ పాతిరా', 'కన్నుర్ స్క్వాడ్' తరహాలోనే 'ఉయిర్' కూడా అవుట్ అండ్ అవుట్ సీటు అంచున కూర్చోబెట్టే కథనంతో రాబోతోంది.

ప్రొబేషన్ టైమ్‌లోనే ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్‌కు ఎదురైన బెదిరింపులు, ఒత్తిళ్లు, అతను కేసును పరిష్కరించిన తీరు థ్రిల్లర్ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయి. మూడీ సినిమాటోగ్రఫీ, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రైమ్ అసెట్స్‌గా నిలిచాయి. జూన్ 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులను పాజిటివ్, క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.

ఆగస్టు 4 నుంచి 5 భాషల్లో రచ్చ.. పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్

విభిన్నమైన కథలను ఆదరించే తెలుగు డిజిటల్ ఆడియన్స్‌కు జియోహాట్‌స్టార్ అందించబోతున్న 'ఉయిర్' ఒక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్‌గా మారనుంది. 5 భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుండటంతో ఓటీటీ ప్రేమికులు ఈ క్రైమ్ డ్రామా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సస్పెన్స్, క్రైమ్, డ్రామా కాన్సెప్ట్‌లను ఇష్టపడే సినీ ప్రియులకు 'ఉయిర్' ఒక మంచి డిజిటల్ ట్రీట్ కానుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More