Vaishnavi Chaitanya: బేబి గుర్తుకు రాకపోతే చాలు.. అందరిలోనూ కడలి ఉంటుంది.. బోల్డే కానీ ఫ్యామిలీ చూడొచ్చు: వైష్ణవి చైతన్య

Vaishnavi Chaitanya on Epic Movie: ఆనంద్ దేవరకొండతో కలిసి ఎపిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది వైష్ణవి చైతన్య. ఈ సినిమా గురించి, తన కడలి పాత్ర గురించి ఆమె ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Published on: Sep 8, 2026, 18:21:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vaishnavi Chaitanya on Epic Movie: బ్లాక్‌బస్టర్ సినిమా 'బేబి'తో తెలుగు యూత్‌లో క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య, మళ్లీ ఆనంద్ దేవరకొండతో కలిసి నటించిన లేటెస్ట్ లవ్ అండ్ లైఫ్ డ్రామా 'ఎపిక్' (Epic). సూపర్ హిట్ వెబ్ సిరీస్ '#90's' ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 11) థియేటర్లలోకి రాబోతోంది. సినిమా రిలీజ్ సందడి నేపథ్యంలో వైష్ణవి చైతన్య మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Vaishnavi Chaitanya: బేబి గుర్తుకు రాకపోతే చాలు.. అందరిలోనూ కడలి ఉంటుంది.. బోల్డే కానీ ఫ్యామిలీ చూడొచ్చు: వైష్ణవి చైతన్య
Vaishnavi Chaitanya: బేబి గుర్తుకు రాకపోతే చాలు.. అందరిలోనూ కడలి ఉంటుంది.. బోల్డే కానీ ఫ్యామిలీ చూడొచ్చు: వైష్ణవి చైతన్య

'కడలి' క్యారెక్టర్ ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది

ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి వైష్ణవి చెబుతూ.. "నేను పోషించిన 'కడలి' అనే పాత్ర ప్రతీ ఒక్కరిలోనూ దాగి ఉంటుంది. మన కుటుంబం, సమాజం వల్ల మనలో ఒక ప్రత్యేకమైన వెర్షన్ ఉండిపోతుంది. ఆ క్యారెక్టర్ అంత సులభంగా బయటకు రాదు. కానీ జీవితంలో ఒక పాయింట్ వద్ద ప్రతీ ఒక్కరూ తమ కోసం తాము నిలబడాల్సి వస్తుంది. అందుకే కడలి పాత్ర నా హృదయానికి చాలా దగ్గరైంది" అని వెల్లడించారు.

బేబీ గుర్తుకు రాకపోతే చాలు

'బేబీ' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్లీ ఆనంద్ దేవరకొండతో నటించడంపై ఎటువంటి ఒత్తిడి లేదని వైష్ణవి స్పష్టం చేశారు. "నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ 'ఎపిక్' మూవీని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను. థియేటర్‌లో ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు 'బేబీ' సినిమా గుర్తురాకపోతే, మేము నటులుగా సక్సెస్ అయినట్లే. ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

లవ్ స్టోరీలో కొత్త కాన్సెప్ట్..లివిన్ రిలేషన్షిప్

ప్రేమకథలు చాలా వచ్చినా 'ఎపిక్' సినిమాకు ఒక యూనిక్ పాయింట్ ఉందని వైష్ణవి చెప్పారు. "భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఒక అబ్బాయి, ఒక అమ్మాయి యూకే వెళ్తారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన వాళ్లిద్దరూ అక్కడ కలిసి ఒకే ఇంట్లో ఉండటం ప్రారంభిస్తారు. వాళ్లిద్దరి మధ్య జరిగే పర్సనల్ సంభాషణలే ఈ సినిమాకు కాన్సెప్ట్. ఒక అమ్మాయి, అబ్బాయి లైఫ్‌ను చూసే విధానం ఎలా ఉంటుంది? వాళ్లు ఎలా కలుసుకున్నారు? అనే పాయింట్ ఈ కథకు కొత్తదనాన్ని ఇస్తుంది" అని వివరించారు.

లివ్ ఇన్ రిలేషన్‌షిప్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా చూడొచ్చని వైష్ణవి హామీ ఇచ్చారు. "#90's సిరీస్ లాగా ఇది కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాకపోవచ్చు. కానీ కథకు ఎంత అవసరమో డైరెక్టర్ ఆదిత్య అంతే చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బంది కలిగించే అసభ్యకరమైన సీన్లు ఏవీ లేకుండా డైరెక్టర్ చాలా జాగ్రత్త పడ్డారు" అని తెలిపారు.

ఈ సినిమాతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది

ఈ క్యారెక్టర్ ద్వారా పర్సనల్‌గా చాలా విషయాలు నేర్చుకున్నానని వైష్ణవి అన్నారు. "నాకు సాధారణంగా పబ్లిక్‌లో మాట్లాడాలంటే కొంత భయం, కంగారు ఉండేది. కానీ కడలి పాత్ర చేసిన తర్వాత మనల్ని మనం ముందుగా నమ్మాలని, కాన్ఫిడెంట్‌గా ఉండాలని అర్థమైంది. స్వతంత్రంగా ఉండే మహిళల గురించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ సమస్యలను ఎదుర్కొంటూనే జీవితంలో ముందడుగు వేసే అమ్మాయి కథను ఎపిక్‌లో చూపించడమే స్పెషాలిటీ. నా క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్‌కు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాం" అని తెలిపారు.

తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చెబుతూ, "సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లోనే నితిన్ తో ఒక సినిమా చేస్తున్నాను. దీనితో పాటు తమిళంలో రెండు సినిమాలు, బాలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లైన్‌అప్‌లో ఉన్నాయి" అని వైష్ణవి చైతన్య ముగించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More