Vaishnavi Chaitanya Age: నా అసలైన ఏజ్ ఇదే.. లైవ్ ఇంటర్వ్యూలో ఆధార్ కార్డ్ చూపించిన వైష్ణవి చైతన్య

Vaishnavi Chaitanya Age: వైష్ణవి చైతన్య తన వయసెంతో లైవ్ ఇంటర్వ్యూలో రివీల్ చేయడం విశేషం. వికిపీడియాలో తన వయసు 32 ఏళ్లు అని చూపిస్తుండటంతో ఆమె తన ఆధార్ చూపించి మరీ క్లారిటీ ఇవ్వడం విశేషం.

Published on: Sep 21, 2026, 16:09:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vaishnavi Chaitanya Age: తన వయసుపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఊహించని రీతిలో ఫుల్‌స్టాప్ పెట్టారు. ఏకంగా ఒక లైవ్ ఇంటర్వ్యూలోనే తన ఒరిజినల్ ఆధార్ కార్డు బయటకు తీసి చూపిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. గూగుల్, వికిపీడియాలో తన పుట్టిన సంవత్సరం తప్పుగా ఉందంటూ ఆ ఆన్‌లైన్ రూమర్స్‌కి స్ట్రాంగ్ క్లారిటీ ఇచ్చారు.

Vaishnavi Chaitanya Age: నా అసలైన ఏజ్ ఇదే.. లైవ్ ఇంటర్వ్యూలో ఆధార్ కార్డ్ చూపించిన వైష్ణవి చైతన్య
Vaishnavi Chaitanya Age: నా అసలైన ఏజ్ ఇదే.. లైవ్ ఇంటర్వ్యూలో ఆధార్ కార్డ్ చూపించిన వైష్ణవి చైతన్య

వికిపీడియాలో ఘోరమైన తప్పు.. అసలు వయసెంతో తెలుసా?

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొంతకాలంగా వైష్ణవి చైతన్య వయసు గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వికిపీడియాలో ఆమె 1994లో జన్మించినట్లు, ప్రస్తుతం ఆమె వయసు 32 సంవత్సరాలు ఉన్నట్లు నమోదు చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ చూసి నెటిజన్లు, అభిమానులు తీవ్రంగా కన్ఫ్యూజ్ అయ్యారు.

ఈ విషయమై రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వైష్ణవి ఓపెన్‌గా స్పందించారు. "నా వయసు గురించి నెట్‌లో తప్పుడు ప్రచారం జరుగుతోంది. వికిపీడియాలో ఎవరో నేను 1994లో పుట్టినట్లు రాసేశారు. అది చూసి నాకే బాగా నవ్వొచ్చింది" అని వ్యాఖ్యానించారు.

మాటలతో చెబితే ఎవరూ నమ్మరని భావించిన ఈ బేబీ బ్యూటీ.. వెంటనే తన పర్సనల్ బ్యాగ్ నుంచి ఒరిజినల్ ఆధార్ కార్డు తీసి కెమెరా ముందు పెట్టారు. తాను 2001లో జన్మించానని, ప్రస్తుతం తన వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమేనని ఆ ప్రూఫ్‌తో సహా నిరూపించారు.

బర్త్ ప్లేస్ పై కూడా క్లారిటీ.. ఆన్‌లైన్ డేటా అంతా ఫేక్

వయసు మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లో ఉన్న తన బర్త్ ప్లేస్ డీటెయిల్స్ కూడా తప్పుగానే ఉన్నాయని వైష్ణవి స్పష్టం చేశారు. నెట్‌లో వేరే ఊరు పేరు రాసి ఉందని, కానీ తాను పక్కా హైదరాబాదీనని గర్వంగా చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని, ఇక్కడే చదువుకున్నానని తెలిపారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో చిత్రపరిశ్రమలోకి వచ్చినప్పుడు ఇలాంటి అనవసరమైన రూమర్స్ రావడం బాధ కలిగిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

యూట్యూబ్ నుంచి టాలీవుడ్ స్టార్‌డమ్ దాకా.. స్పెషల్ జర్నీ

వైష్ణవి చైతన్య సినీ ప్రయాణం చాలామందికి ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్. యూట్యూబ్‌లో వచ్చిన 'ది సాఫ్ట్‌వేర్ డెవ్‌లవ్‌పర్' అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యారు. ఆ సిరీస్‌లో తన నటనతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

ఆ తర్వాత అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలో చిన్న పాత్రలో మెరిసినా, ఆనంద్ దేవరకొండ సరసన నటించిన 'బేబీ' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఈ సినిమాలో 'వైష్ణవి' పాత్రలో ఆమె చూపించిన నటన, పండించిన ఎమోషన్స్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి.

ఇక ఈ మధ్యే ఆమె ఆనంద్ దేవరకొండతో కలిసి ఎపిక్ మూవీతో వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. బేబీ కాంబినేషన్ రిపీటైనా ఆ మ్యాజిక్ మాత్రం వర్కౌట్ కాలేదు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More