...
...
Next Story

OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- కొత్త చెప్పుల కోసం చిన్నారి ఆరాటం, బిడ్డను వద్దనుకునే తండ్రి

Varam D/O Bhargavi OTT Release: ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా వరం డాటర్ ఆఫ్ భార్గవి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఒక చిన్నారి అమాయకత్వం, ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన సరోగసీ నిజాల చుట్టూ సాగే భావోద్వేగపు కథగా తెరకెక్కించారు. మరి డాటర్ ఆఫ్ భార్గవి ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Nov 1, 2026, 13:01:06 IST
Advertisement

Varam D/O Bhargavi OTT Streaming Today: డిజిటల్ మీడియా రంగంలో వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటున్న ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్ మరో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో ఇవాళ (నవంబర్ 1) ముందుకు వచ్చింది. ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా నేడు ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు సినిమా 'వరం D/o భార్గవి'

చిన్న పిల్లల అమాయకత్వం

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- కొత్త చెప్పుల కోసం చిన్నారి ఆరాటం, బిడ్డను వద్దనుకునే తండ్రి
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- కొత్త చెప్పుల కోసం చిన్నారి ఆరాటం, బిడ్డను వద్దనుకునే తండ్రి

చిన్న పిల్లల అమాయకత్వం, వారి సరదాలు, దానికి వెనుకున్న ఆర్థిక పరిస్థితులను ఎంతో సహజంగా తెరకెక్కించిన వరం డాటర్ ఆఫ్ భార్గవి ఓటీటీలో నేటి నుంచి సందడి చేస్తోంది.

రైల్వే బొగ్గు చోరీ నుంచి చెప్పుల షాపు దాకా..

వరం అనే ఒక చిన్నారి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. రోజువారీ సరదాల కోసం తన స్నేహితుడితో కలిసి రైలు పెట్టెల నుంచి బొగ్గును దొంగిలించడం ఆ పాపకు అలవాటు. ఆ తెచ్చిన బొగ్గును కొనుగోలు చేశానని ఇంట్లో తల్లి భార్గవిని నమ్మిస్తుంది.

ఐస్‌క్రీమ్ తినే డబ్బు దాచి

దొంగిలించిన బొగ్గు అమ్మగా వచ్చిన డబ్బులతో ప్రతిరోజూ ఐస్‌క్రీమ్ తింటూ హాయిగా గడిపే ఆ చిన్నారి కన్ను ఒకరోజు దుకాణంలో ఉన్న ఖరీదైన చెప్పులపై పడుతుంది. దాంతో ఐస్‌క్రీమ్ తిన్నట్లు అబద్ధాలు చెప్పి ప్రతి రోజు 10 రూపాయలు సేవ్ చేస్తుంది.

దొంగతనం నేరం

ఆ డబ్బుతో ఆ ఖరీదైనా చెప్పులు కొని తీసుకెళ్తుంది. కానీ, అందులో పనిచేసే వ్యక్తి ఆ చెప్పులను వరం కొట్టేసిందని యజమానికి చెబుతాడు. దాంతో పనిచేసే వ్యక్తి, యజమాని ఇద్దరు వరం ఇంటికి వెళ్తారు. అక్కడే పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది.

జీవితాన్ని మార్చిన షాకింగ్ నిజం!

పవన్ రాచేపల్లి దర్శకత్వం వహించిన వరం డాటర్ ఆఫ్ భార్గవి చిత్రానికి విజయశాంతి నిర్మాతగా వహించారు. బేబీ జెస్సికా, దివ్య దీపిక, సతీష్ సారిపల్లి, విజయ్ భారత్, మహేంద్ర గణచారి, పవన్, స్వర్ణ, మాస్టర్ యతీష్ ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు.

వరం డాటర్ ఆఫ్ భార్గవి ఓటీటీ స్ట్రీమింగ్

సాయి మధుకర్ అందించిన సంగీతం, పి.ఎమ్. ఉన్నికృష్ణన్ ఛాయాగ్రహణం కథలోని ఎమోషన్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. సమాజంలో సరోగసీ, అనుబంధాల చుట్టూ అల్లిన ఈ మానవీయ కోణం ప్రేక్షకులను ఆలోజింపజేసేలా రూపొందించారు. ట్విస్టులతో సాగే ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న వరం D/o భార్గవి బెస్ట్ ఛాయిస్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks