Vidya Balan: ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరో వర్ధంతి సందర్భంగా ఒక అద్భుతం జరిగింది. జీవించి ఉన్నప్పుడు ఆయన నటించిన ‘ది లాస్ట్ టెనెంట్’ సినిమా 25 ఏళ్ల తర్వాత నేరుగా యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ చిత్రంలో ఇర్ఫాన్‌తో కలిసి నటించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్.. తాజాగా ఈ మూవీని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పంచుకుంది.
అది చీకటి కాలం

"ది లాస్ట్ టెనెంట్ షూటింగ్ ముగిసిన 25 ఏళ్ల తర్వాత నిన్న రాత్రి మొదటిసారి ఆ సినిమా చూశా. షూటింగ్ పూర్తయ్యాక ఏదో కారణం వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. అది నా జీవితంలో ఒక చీకటి కాలం.
నేను ఏ పని మొదలుపెట్టినా అప్పుడు ఆగిపోయేది. నా మొదటి మలయాళ చిత్రం 'చక్రం' అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ తర్వాత దాదాపు మూడేళ్ల కాలంలో సుమారు డజను సినిమాల నుంచి నన్ను తప్పించారు" అని విద్యా బాలన్ ఆనాటి రోజులను గుర్తు చేసుకుంది.
దర్శకుడి మెసేజ్ తో
తన కష్టకాలంలో వచ్చిన సినిమా కావడంతో 'ది లాస్ట్ టెనెంట్' గురించి కూడా విద్యా బాలన్ పూర్తిగా మర్చిపోవాలని నిర్ణయించుకున్నారట. అయితే దర్శకుడు సార్థక్ దాస్‌గుప్తా గత వారం మెసేజ్ చేసే వరకు ఈ చిత్రం విడుదలవుతుందన్న విషయం తనకు తెలియదని ఆమె చెప్పింది.
ఇర్ఫాన్‌తో షూటింగ్
"ఆ రోజుల్లో షూటింగ్ సెట్ నుంచి నా సోదరి ప్రియకు ఫోన్ చేసి, ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి నటిస్తున్నానని ఎంతో ఉత్సాహంగా చెప్పాను. అప్పుడే ఆయన నటన ఎంతో సహజంగా ఉండేది. నిన్న సినిమా చూస్తున్నప్పుడు కూడా నాకే అదే అనిపించింది. ఆయన నటనలో ఎక్కడా ఆర్టిఫిషియల్ ఫీల్ ఉండదు.
మేము కలిసి నటించాల్సిన కొన్ని సినిమాలు ఆగిపోయాయని ఇర్ఫాన్ మరణం తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు మా ఇద్దరి కలయికలో 'ది లాస్ట్ టెనెంట్' రూపంలో కనీసం ఒక్క సినిమా అయినా ఉందన్న సంతృప్తి మిగిలింది" అని ఇర్ఫాన్ నటనకు విద్యా జోహార్లు అర్పించింది.
ఎందుకు ఆగిపోయింది?
{{/usCountry}}మేము కలిసి నటించాల్సిన కొన్ని సినిమాలు ఆగిపోయాయని ఇర్ఫాన్ మరణం తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు మా ఇద్దరి కలయికలో 'ది లాస్ట్ టెనెంట్' రూపంలో కనీసం ఒక్క సినిమా అయినా ఉందన్న సంతృప్తి మిగిలింది" అని ఇర్ఫాన్ నటనకు విద్యా జోహార్లు అర్పించింది.
ఎందుకు ఆగిపోయింది?
{{/usCountry}}దర్శక నిర్మాత సార్థక్ దాస్‌గుప్తా ఈ సినిమాను పూర్తి చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. సినిమాకు సంబంధించిన ఒరిజినల్ ఫుటేజ్ పోవడంతో ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. ఇక ఈ సినిమా రాదని ఆశలు వదులుకున్న తరుణంలో, అనుకోకుండా ఒక పాత వీహెచ్‌ఎస్ (VHS) కాపీ లభ్యమైంది. దాన్ని డిజిటలైజ్ చేసి, రిస్టోరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
కథా నేపథ్యం
ది లాస్ట్ టెనెంట్ చిత్రం ఒక విభిన్నమైన కథాంశంతో సాగుతుంది. జీవితంలో విసిగిపోయిన ఒక సంగీత విద్వాంసుడు.. దేశం విడిచి వెళ్ళే ముందు ఒక పాడుబడ్డ ఇంట్లో తలదాచుకుంటాడు. అక్కడ గడిపిన సమయంలో పాత జ్ఞాపకాలు, సంగీతం, ఒంటరితనం అతడిని ఎలా ప్రభావితం చేశాయన్నదే ఈ సినిమా. ఇందులో అన్ను ఖండేల్వాల్, సౌరభ్ అగర్వాల్, సబ్య సాచి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఈ అరుదైన చిత్రాన్ని ఇప్పుడు ఆయన అభిమానులు యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'ది లాస్ట్ టెనెంట్' సినిమా ఎక్కడ అందుబాటులో ఉంది?
జవాబు: ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ఉచితంగా వీక్షించడానికి అందుబాటులో ఉంది.
ప్రశ్న: ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది?
జవాబు: ఈ చిత్రం షూటింగ్ 25 ఏళ్ల క్రితమే జరిగింది.
ప్రశ్న: సినిమా ఇన్నేళ్లు ఎందుకు విడుదల కాలేదు?
జవాబు: చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ ఫుటేజ్ పోవడంతో ఇది నిలిచిపోయింది. ఇటీవల వీహెచ్‌ఎస్ కాపీ దొరకడంతో దర్శకుడు దీన్ని విడుదల చేశారు.