Vijay Rashmika: ఫ్యాన్స్‌కు విరోష్ స్పెష‌ల్ విందు.. స్వ‌యంగా వ‌డ్డించిన విజ‌య్‌, ర‌ష్మిక‌.. భ‌ర్త‌కు తినిపించిన మంద‌న్న‌

Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ఫ్యాన్స్ కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. అభిమానులకు స్పెషల్ గా విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో తన భర్త విజయ్ కు రష్మిక ప్రేమతో తినిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

Published on: Mar 4, 2026, 08:07:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలను అందించారు. ఈ విరోష్ జోడీ ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో తమ అభిమానులకు విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో భర్త విజయ్ కు రష్మిక ప్రేమతో తినిపించింది.

ఫ్యాన్స్ కు విజయ్, రష్మిక స్పెషల్ విందు
ఫ్యాన్స్ కు విజయ్, రష్మిక స్పెషల్ విందు

విరోష్ విందు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ అభిమానులను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. ఇప్పుడు తమ పెళ్లి సందర్భంగా ఫ్యాన్స్ కు గుర్తుండిపోయే రిసెప్షన్ విందు ఏర్పాటు చేశారు. మంగళవారం (మార్చి 3) రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఫ్యాన్స్ కోసం ఈ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో స్వయంగా విజయ్, రష్మిక తమ చేతులతో ఫ్యాన్స్ కు వడ్డించారు.

వీడియో వైరల్

ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ డిన్నర్ లో విజయ్, రష్మిక మెరిశారు. ప్రతి ఒక్క అభిమానికి వీళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఓ అమ్మాయిని రష్మిక హగ్ చేసుకుంది. ఆ తర్వాత అభిమానులకు విజయ్, రష్మిక కలిసి వడ్డించారు. ఆటోగ్రాఫ్ లు, ఫొటోలు ఇచ్చారు. అనంతరం విజయ్, రష్మిక కూడా వాళ్లతో కలిసి భోజనం చేశారు. రష్మిక తన భర్త విజయ్ కు ప్రేమతో తినిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్రెడిషనల్ గా

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ట్రెడిషనల్ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన విందులో రష్మిక చక్కగా చీరకట్టులో కనిపించింది. మెడలో మంగళసూత్రం, నుదుటన సింధూరంతో ఎంతో ముచ్చటగా ఉంది. విజయ్ ఏమో ఫ్లవర్స్ డిజైన్ తో కూడిన కుర్తా ధరించాడు. ఈ ఇద్దరూ తమ అభిమానులతో ఎంతో సరదాగా టైమ్ గడిపారు.

ఇవాళ రిసెప్షన్

ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొడ, రష్మిక మందన్న పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన ఈ జోడీ తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించింది. అనంతరం విజయ్ దేవరకొండ సొంత గ్రామంలో నూతన గృహ‌ప్ర‌వేశంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి ఫ్యాన్స్ కు విందు ఏర్పాటు చేశారు. ఈ రోజు (మార్చి 4) హైదరాబాద్ లో విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More