Vijay Rashmika: రవీంద్ర పుల్లె దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా 'మైసా' (Mysaa). ఈ సినిమా నుంచి మోస్ట్ అవేటెడ్ మొదటి పాట ‘ఓ మైసా రే’ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పాటను చూసిన రష్మిక భర్త, ఐకానిక్ స్టార్ విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ రష్మికపై ప్రశంసల జల్లు కురిపించారు. నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, పాట వెనుక ఉన్న క్రేజీ విశేషాలు ఇవే.
వైల్డ్ పిల్లా అంటూ పొగడ్తలు

"వైల్డ్ పిల్లా.. ఈ పాట కోసం నువ్వు ఎంతగా శ్రమించావో, తీవ్రంగా గాయపడినా సరే ఎంతగా కష్టపడ్డావో నాకు తెలుసు. నీ కెరీర్లోనే మరో మైలురాయిలాంటి ఎపిక్ సినిమాగా 'మైసా' నిలుస్తుంది. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి నేను ఎంతగానో వేచి చూస్తున్నాను"* అంటూ విజయ్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.
దీనికి రష్మిక స్పందిస్తూ.. “విజ్జూ!! నేను ఈ సినిమా కోసం ఎంత ఉత్సాహంగా ఉన్నానో, అంతే భయంగా కూడా ఉందమ్మా!” అని రీ-షేర్ చేసింది. ఈ పాట షూటింగ్ సమయంలోనే రష్మిక తీవ్రమైన తుంటి గాయానికి (Hip Injury) గురైన విషయం తెలిసిందే. అప్పట్లో షూటింగ్ కు కూడా చాలా రోజులు దూరంగా ఉంది.
మైండ్ బ్లాకింగ్ విజువల్స్‌తో 'ఓ మైసా రే'.. పూనకాలు తెప్పిస్తున్న అమ్మవారి సీన్
దాదాపు 5 నిమిషాల నిడివితో సాగే 'ఓ మైసా రే' పాటను జేక్స్ బిజోయ్ అత్యంత గ్రాండ్‌గా స్వరపరిచారు. ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ అందించిన శక్తివంతమైన సాహిత్యం, సింధుజ శ్రీనివాసన్ ఆలపించిన వాయిస్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
ఎర్రటి చీరకట్టులో, ఒంటి నిండా సిందూరం, రక్తం మరకలతో ఉన్న రష్మికకు గ్రామ దేవత లేదా అమ్మవారి శక్తి ఆవహించినట్లుగా సాగే ఈ పూనకాల డ్యాన్స్ విజువల్స్ నెటిజన్లకు షాక్ ఇస్తున్నాయి. చేతిలో ఆయుధం పట్టుకుని రష్మిక చేసిన శివతాండవం వంటి డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్.. భారీ తారాగణం
{{/usCountry}}ఎర్రటి చీరకట్టులో, ఒంటి నిండా సిందూరం, రక్తం మరకలతో ఉన్న రష్మికకు గ్రామ దేవత లేదా అమ్మవారి శక్తి ఆవహించినట్లుగా సాగే ఈ పూనకాల డ్యాన్స్ విజువల్స్ నెటిజన్లకు షాక్ ఇస్తున్నాయి. చేతిలో ఆయుధం పట్టుకుని రష్మిక చేసిన శివతాండవం వంటి డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్.. భారీ తారాగణం
{{/usCountry}}ఈ మైసా చిత్రంలో రష్మికతో పాటు టాలీవుడ్ ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈశ్వరీ రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేష్, శివ కందుకూరి, కార్తీక్ రంజిని, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇక 2018లో వచ్చిన 'గీత గోవిందం', 2019 నాటి 'డియర్ కామ్రేడ్' చిత్రాలతో టాలీవుడ్లోనే బెస్ట్ ఆన్‌స్క్రీన్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్-రష్మికలు నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత విడుదలైన 'రణబాలి' చిత్రంతో మళ్లీ వెండితెరపై మ్యాజిక్ రీ-క్రియేట్ చేసిన ఈ హిట్ పెయిర్.. ప్రస్తుతం ఒకరికొకరు సపోర్ట్‌గా నిలుస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఐకానిక్ కపుల్‌గా కొనసాగుతున్నారు.