Vijay Rashmika: వైల్డ్ పిల్లా అంటూ భార్య రష్మిక మైసా సాంగ్‌కు విజయ్ దేవరకొండ క్రేజీ రివ్యూ.. మూవీ గురించి ఏమన్నాడంటే?
Vijay Rashmika: రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రం 'మైసా' (Mysaa) నుంచి 'ఓ మైసా రే' పాట విడుదలైంది. ఈ పాట కోసం రష్మిక తుంటి గాయాన్ని లెక్కచేయకుండా డ్యాన్స్ చేసిందని ఆమె భర్త, స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.
Vijay Rashmika: రవీంద్ర పుల్లె దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా 'మైసా' (Mysaa). ఈ సినిమా నుంచి మోస్ట్ అవేటెడ్ మొదటి పాట ‘ఓ మైసా రే’ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పాటను చూసిన రష్మిక భర్త, ఐకానిక్ స్టార్ విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ రష్మికపై ప్రశంసల జల్లు కురిపించారు. నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, పాట వెనుక ఉన్న క్రేజీ విశేషాలు ఇవే.

వైల్డ్ పిల్లా అంటూ పొగడ్తలు
"వైల్డ్ పిల్లా.. ఈ పాట కోసం నువ్వు ఎంతగా శ్రమించావో, తీవ్రంగా గాయపడినా సరే ఎంతగా కష్టపడ్డావో నాకు తెలుసు. నీ కెరీర్‌లోనే మరో మైలురాయిలాంటి ఎపిక్ సినిమాగా 'మైసా' నిలుస్తుంది. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి నేను ఎంతగానో వేచి చూస్తున్నాను"* అంటూ విజయ్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.
దీనికి రష్మిక స్పందిస్తూ.. “విజ్జూ!! నేను ఈ సినిమా కోసం ఎంత ఉత్సాహంగా ఉన్నానో, అంతే భయంగా కూడా ఉందమ్మా!” అని రీ-షేర్ చేసింది. ఈ పాట షూటింగ్ సమయంలోనే రష్మిక తీవ్రమైన తుంటి గాయానికి (Hip Injury) గురైన విషయం తెలిసిందే. అప్పట్లో షూటింగ్ కు కూడా చాలా రోజులు దూరంగా ఉంది.
మైండ్ బ్లాకింగ్ విజువల్స్‌తో 'ఓ మైసా రే'.. పూనకాలు తెప్పిస్తున్న అమ్మవారి సీన్
దాదాపు 5 నిమిషాల నిడివితో సాగే 'ఓ మైసా రే' పాటను జేక్స్ బిజోయ్ అత్యంత గ్రాండ్‌గా స్వరపరిచారు. ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ అందించిన శక్తివంతమైన సాహిత్యం, సింధుజ శ్రీనివాసన్ ఆలపించిన వాయిస్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
ఎర్రటి చీరకట్టులో, ఒంటి నిండా సిందూరం, రక్తం మరకలతో ఉన్న రష్మికకు గ్రామ దేవత లేదా అమ్మవారి శక్తి ఆవహించినట్లుగా సాగే ఈ పూనకాల డ్యాన్స్ విజువల్స్ నెటిజన్లకు షాక్ ఇస్తున్నాయి. చేతిలో ఆయుధం పట్టుకుని రష్మిక చేసిన శివతాండవం వంటి డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్.. భారీ తారాగణం
ఈ మైసా చిత్రంలో రష్మికతో పాటు టాలీవుడ్ ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈశ్వరీ రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేష్, శివ కందుకూరి, కార్తీక్ రంజిని, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇక 2018లో వచ్చిన 'గీత గోవిందం', 2019 నాటి 'డియర్ కామ్రేడ్' చిత్రాలతో టాలీవుడ్‌లోనే బెస్ట్ ఆన్‌స్క్రీన్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్-రష్మికలు నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత విడుదలైన 'రణబాలి' చిత్రంతో మళ్లీ వెండితెరపై మ్యాజిక్ రీ-క్రియేట్ చేసిన ఈ హిట్ పెయిర్.. ప్రస్తుతం ఒకరికొకరు సపోర్ట్‌గా నిలుస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఐకానిక్ కపుల్‌గా కొనసాగుతున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


