Vijay Rashmika: విజయ్, రష్మికను చూడటానికి ఎగబడిన జనం.. నాగర్‌కర్నూల్‌లో అభిమాన సంద్రం.. వీడియో వైరల్

ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వైభవంగా వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు తమ వైవాహిక జీవితంలో మరో ముఖ్య ఘట్టాన్ని పూర్తి చేశారు. సోమవారం (మార్చి 2) తెలంగాణలోని తుమ్మనపేటలో గల తమ కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసి, సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు.

Published on: Mar 2, 2026, 19:51:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న ఈ జంట.. సోమవారం (మార్చి 2) తమ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. తెలంగాణలోని తుమ్మనపేటలో వారు నిర్మించుకున్న కొత్త ఇంట్లో అత్యంత వైభవంగా 'గృహప్రవేశం', 'సత్యనారాయణ వ్రతం' నిర్వహించారు.

Vijay Rashmika: విజయ్, రష్మికను చూడటానికి ఎగబడిన జనం.. నాగర్‌కర్నూల్‌లో అభిమాన సంద్రం.. వీడియో వైరల్
Vijay Rashmika: విజయ్, రష్మికను చూడటానికి ఎగబడిన జనం.. నాగర్‌కర్నూల్‌లో అభిమాన సంద్రం.. వీడియో వైరల్

అభిమానుల కోలాహలం

తమ అభిమాన జంట కొత్త ఇంట్లోకి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న వందలాది మంది అభిమానులు తుమ్మనపేటకు చేరుకున్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం విజయ్, రష్మికలు బయటకు వచ్చి అభిమానులను పలకరించారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ తన అర్ధాంగి రష్మిక చేయి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకురాగా, ఆమె అభిమానులకు అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మైక్ తీసుకున్న రష్మిక.. "ఐ లవ్ యు" అంటూ అభిమానులపై తన ప్రేమను చాటుకోగా, విజయ్ సైతం అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

టీటీడీ ఆలయ సందర్శన

అంతకుముందు ఈ కొత్త దంపతులు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న టీటీడీ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో తమను కలిసిన భక్తులకు స్వయంగా స్వీట్లు పంపిణీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. "మా మనసు నిండా సంతోషం నిండిపోయింది" అంటూ రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఆలయ పర్యటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

అంతేకాదు దేశవ్యాప్తంగా వివిధ చోట్ల జరిగిన స్వీట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా రష్మిక అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దేశంలో ఓ సెలబ్రిటీ జోడీ పెళ్లి తర్వాత ఇలా దేశవ్యాప్తంగా స్వీట్లు పంచడం, అన్నదానాలు చేయడం అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది.

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

విజయ్-రష్మిక వివాహ విందు (రిసెప్షన్) మార్చి 4న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అతిథుల జాబితాను పరిమితం చేసినట్లు సమాచారం. అభిమానులు వేడుక జరిగే ప్రాంతానికి రావొద్దని, కేవలం ఆహ్వానితులు మాత్రమే రావాలని పోలీసులు, నిర్వహకులు కోరారు. ప్రధాని మోదీతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More