విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్.. రిలీజ్ డేట్ ఇదే.. గ్లింప్స్ వీడియోలో ఇంటెన్స్ లుక్‌.. జయమ్మగా రష్మిక

విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. ఇండియాకు స్వాతంత్య్రం రాక ముందు దేశంలో జరిగిన మారణహోమం చుట్టూ తిరిగే చారిత్రక కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది.

Published on: Jan 26, 2026, 20:44:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమాకు రణబాలి (Ranabaali) అనే టైటిల్ పెట్టారు. శ్యామ్ సింగరాయ్ మూవీ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమా గ్లింప్స్ ను సోమవారం (జనవరి 26) రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక మందన్న పాత్రను జయమ్మగా పరిచయం చేశారు. వీడియో ఎలా ఉందో చూడండి.

విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్.. రిలీజ్ డేట్ ఇదే.. గ్లింప్స్ వీడియోలో ఇంటెన్స్ లుక్‌.. జయమ్మగా రష్మిక
విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్.. రిలీజ్ డేట్ ఇదే.. గ్లింప్స్ వీడియోలో ఇంటెన్స్ లుక్‌.. జయమ్మగా రష్మిక

రణబాలి గ్లింప్స్ వీడియో

చాలా రోజులుగా ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా మూవీ రణబాలితో వస్తున్నాడు. చారిత్రక కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై అతడు భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ రణబాలి గ్లింప్స్ వీడియోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. భారత స్వాతంత్య్రోద్యామానికి ముందు బ్రిటీష్ ఇండియాలో జరిగిన మారణహోమం గురించి ఈ వీడియోలో చూపించారు. హిట్లర్ చేసిన హోలోకాస్ట్ కంటే ఎక్కువ దారుణాలు మన దేశంలో జరిగినట్లుగా చెప్పారు.

బ్రిటీషర్లు ఇండియా నుంచి దోచుకెళ్లిన డబ్బు ఎంత? స్వేచ్ఛ కోసం చేసిన పోరాటంలో కన్నుమూసిన వాళ్లు ఎంత మంది? అనే విషయాలను నంబర్స్ రూపంలో చూపించారు. ఇది ఇండిపెండెన్స్ స్టోరీ కాదని, అంతకుముందు జరిగిన దారుణాలకు సంబంధించినది అంటూ వీడియో మొదట్లోనే మేకర్స్ చెప్పారు. ఇక వీడియో చివర్లో విజయ్ దేవరకొండ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంది. గుర్రంపై వస్తూ ఓ బ్రిటీషర్ ను రైలు పట్టాలపై ఈడ్చుకుంటూ వెళ్తున్న విజయ్ చాలా ఆవేశంగా కనిపిస్తున్నాడు.

రణబాలి మూవీ గురించి..

రణబాలి మూవీని రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో టైటిల్ పాత్రలో విజయ్ నటిస్తున్నాడు. ఇక రష్మిక మందన్న ఇందులో జయమ్మ అనే పాత్ర పోషించినట్లు వీడియోలో చూపించారు. బాలీవుడ్ జోడీ అజయ్, అతుల్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. వాళ్ల బీజీఎం ఈ గ్లింప్స్ వీడియోను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ఈ రణబాలి మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More