Virat Kohli: బోల్డ్ బ్యూటీ ఫొటోకు కోహ్లి లైక్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు.. అల్గారిథం తప్పంటూ
Virat Kohli: విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసిన చిన్న లైక్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. పాత వివాదాలను గుర్తుచేస్తూ నెటిజన్లు మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ ఫామ్ కంటే ఇప్పుడు కోహ్లీ అల్గారిథమ్ లెక్కలే హాట్ టాపిక్.
Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లి మైదానంలో తన బ్యాట్‌తో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తాడో, మైదానం బయట అతని సోషల్ మీడియా యాక్టివిటీ కూడా అంతే స్థాయిలో సంచలనం రేపుతోంది. తాజాగా కోహ్లి ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను లైక్ చేయడం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ, పాత 'అల్గారిథమ్' కథలను మళ్లీ తెరపైకి తెస్తున్నారు.

కోహ్లి లైక్
జర్మనీలో ఉంటున్న ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్ లాజ్ (LizLaz) పాత పోస్ట్‌ను విరాట్ కోహ్లి లైక్ చేశాడు. విచిత్రమేమిటంటే ఇన్ స్టాగ్రామ్ లో కోహ్లి అసలు ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఫాలో అవ్వడం లేదు. అయినప్పటికీ ఆ పోస్ట్‌ను లైక్ చేయడంతో నిమిషాల వ్యవధిలోనే అది వైరల్ అయ్యింది. ఆ పోస్టులో వైట్ డ్రెస్ లో లిజ్ లాజ్ గ్లామర్ గా కనిపించింది.
వైరల్
బోల్డ్ బ్యూటీ లిజ్ లాజ్ పోస్టును కోహ్లి లైక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను తీసి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అభిమానులు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. "కోహ్లి ఈ పోస్ట్‌ను లైక్ చేశారు.. బహుశా అల్గారిథమ్ గురించి మరో పెద్ద వివరణ ఇచ్చే పేజీ లోడ్ అవుతోంది కాబోలు" అంటూ ఒక అభిమాని జోక్ చేశాడు.

కోహ్లీకి సపోర్ట్
మరికొందరు కోహ్లికి మద్దతుగా నిలిచారు. "ఇదంతా ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ సమస్య మాత్రమే. కొన్నిసార్లు మనం లైక్ చేయని పోస్టులు కూడా మన ఫీడ్‌లో కనిపిస్తుంటాయి. ఇది ఎవరికైనా జరగవచ్చు" అని కొందరు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అల్గారిథమ్ కథ ఏంటి?
నిజానికి కోహ్లీకి ఇలాంటి ఇబ్బంది ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2025లో కూడా బాలీవుడ్ నటి, ఇన్‌ఫ్లుయెన్సర్ అవనీత్ కౌర్ ఫ్యాన్ పేజీకి చెందిన ఒక పోస్ట్‌ను కోహ్లి లైక్ చేశాడు. అప్పట్లో అది పెద్ద దుమారమే రేపింది. ఆ సమయంలో కోహ్లి స్పందిస్తూ.. అది అనుకోకుండా జరిగిన పొరపాటని, తన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు అల్గారిథమ్ కారణంగా ఆ పోస్ట్ లైక్ అయిందని వివరణ ఇచ్చాడు.
మైదానంలో రికార్డుల వేట
ఐపీఎల్ 2026లో కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లి 5 మ్యాచ్ ల్లో 228 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం ఈ సీజన్ లో కోహ్లీనే టాప్ స్కోరర్.
మొత్తానికి విరాట్ కోహ్లీ అటు బ్యాట్‌తోనూ, ఇటు సోషల్ మీడియా యాక్షన్లతోనూ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజా లైక్ వ్యవహారాన్ని కోహ్లీ అభిమానులు ఒక ఫన్నీ మీమ్ ఫెస్ట్‌లా మార్చేసి ఎంజాయ్ చేస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
- విరాట్ కోహ్లీ తాజాగా ఎవరి పోస్ట్‌ను లైక్ చేశాడు?
ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్ లాజ్ కు సంబంధించిన ఒక పాత పోస్ట్‌ను కోహ్లీ లైక్ చేశాడు.
2. కోహ్లీ అల్గారిథమ్ వివరణ వెనుక ఉన్న కథ ఏంటి?
గతంలో అవనీత్ కౌర్ పోస్ట్‌ను లైక్ చేసినప్పుడు, అది అల్గారిథమ్ లోపం వల్ల అనుకోకుండా జరిగిందని కోహ్లీ చెప్పాడు. అప్పటి నుంచి నెటిజన్లు దీనిని ఒక జోక్‌గా వాడుతున్నారు.
3. ఐపీఎల్ 2026లో కోహ్లీ ప్రదర్శన ఎలా ఉంది?
కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


