...
...
Next Story

virosh wedding: ఇవాళే విరోష్ వెడ్డింగ్..రష్మిక, విజయ్ పెళ్లి ముహూర్తం ఇదే.. స్పిరిట్ షూటింగ్ నుంచి పెళ్లికి సందీప్ వంగా!

virosh wedding: ఆ రోజు రానే వచ్చింది. కొన్నేళ్లుగా డేటింగ్, రిలేషన్ షిప్, లవ్ ఊహాగానాలకు తెరదించుతూ రష్మిక, విజయ్ ఒక్కటయ్యేది ఈ రోజే. ఇవాళ ఉద‌య్‌పూర్‌లో విరోష్ వెడ్డింగ్ జరుగుతుంది. ముహూర్తం ఎన్ని గంటలకో ఓ సారి చూసేయండి.

Published on: Feb 26, 2026, 05:51:51 IST
Advertisement

కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇవాళే విరోష్ వెడ్డింగ్. ఫిబ్రవరి 26న ఉద‌య్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో రష్మిక, విజయ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది. వీళ్ల పెళ్లి ముహూర్తం ఎన్ని గంటలకు నిశ్చయించారో ఒకసారి చూసేయండి.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ

విరోష్ వెడ్డింగ్ ముహూర్తం

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి గురువారం ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ జీవితాలను పెళ్లితో ముడి వేసుకోబోతున్నారు. ఉద‌య్‌పూర్‌లోని ఐటీసీ మొమెంటోస్ హోటల్లో ఇవాళ ఉదయం 10.10 గంటలకు విరోష్ వెడ్డింగ్ ముహూర్తం నిశ్చయించారని తెలిసింది.

రెండు సార్లు

ఈ రోజు విరోష్ వెడ్డింగ్ రెండు సార్లు జరుగుతుంది. ఫస్ట్ తెలుగు సంప్రదాయంలో వివాహం జరుగుతుంది. వధువు రష్మిక మందన్న మెడలో వరుడు విజయ్ దేవరకొండ మూడు ముళ్లు వేస్తాడు. ఈ జంట ఏడు అడుగులు నడుస్తుంది. ఆ తర్వాత మరోసారి కొడవ సంప్రదాయంలోనూ విరోష్ పెళ్లి జరుగుతుందని సమాచారం.

సందీప్ రెడ్డి వంగా

విరోష్ వెడ్డింగ్ కోసం సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఉద‌య్‌పూర్‌కు చేరుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని సందీప్ తెరకెక్కిస్తున్నాడు. అయితే రష్మిక, విజయ్ పెళ్లి కోసం అతను షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడని సమాచారం. విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీని సందీప్ తీసిన సంగతి తెలిసిందే. అలాగే సందీప్ మరో మూవీ యానిమల్ లో రష్మిక హీరోయిన్.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి కోసం ఇప్పటికే అతిథులు ఉద‌య్‌పూర్‌ చేరుకున్నారు. ఈ విరోష్ వెడ్డింగ్ కు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, అత్యంత సన్నిహితులను మాత్రమే ఇన్వైట్ చేశారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, రాహుల్ రవీంద్రన్ తదితరులు ఈ పెళ్లికి వెళ్లారు.

ప్రీ వెడ్డింగ్

విరోష్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు గ్రాండ్ గా జరిగాయి. విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో వరుడు, వధువు తరపున వాళ్లు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత మెహందీ, హల్దీ, సంగీత్ ఈవెంట్లు సందడిగా సాగాయి. సంగీత్ లో తమకు కాబోయే కోడలు రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ తల్లి మాధవి ప్రత్యేక బహుమతిగా గాజులు అందించారని తెలిసింది.

కుటుంబ వారసత్వంగా అందిస్తున్న గాజులను రష్మికకు మాధవి ఇచ్చారని సమాచారం. ఈ క్షణంలో అందరూ ఎమోషనల్ అయిపోయారని తెలిసింది. ఈ రోజు పెళ్లి తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో విరోష్ జోడీ గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks