Vvan Trailer: బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (Vvaan: Force Of The Forest) ట్రైలర్ రిలీజ్ అయింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

ముంబైలో హ్యాపీగా జీవించే భార్యాభర్తలుగా సిద్ధార్థ్, తమన్నా కనిపించారు. ఛత్ పూజ వేడుకల కోసం తమ సొంత ఊరికి తిరిగొచ్చిన ఈ జంటకు అక్కడ ఊహించని భయంకర పరిస్థితులు ఎదురవుతాయి.
రాత్రిపూట ఆ అడవిలోకి వెళ్తే చావే.. నెత్తురోడే యాక్షన్ సీన్లు
గ్రామంలో ఉండే 'వాన్ దేవి' పవిత్ర అడవిని నాశనం చేసి బిల్డింగ్‌లు కట్టడానికి విలన్ క్యారెక్టర్ (సునీల్ గ్రోవర్) ప్లాన్ చేస్తాడు. అయితే రాత్రి వేళ ఆ అడవిలోకి ఎవరు వెళ్లినా ప్రాణాలతో తిరిగి రారనే భయంకరమైన నమ్మకం గ్రామస్తుల్లో ఉంటుంది.
అందరి హెచ్చరికలను పక్కనపెట్టి రాత్రిపూట అడవిలోకి వెళ్లిన సిద్ధార్థ్ తీవ్రంగా గాయపడతాడు. పూర్వజన్మలో కూడా ఈ అడవిని, అక్కడి ఆచారాలను కాపాడే బాధ్యత తనదేననే నిజాన్ని హీరో తెలుసుకుంటాడు. ఆ తర్వాత చెట్లను నరకాలనుకునే ముఠాపై సిద్ధార్థ్ ఎలా తిరగబడ్డాడనేదే అసలు సిసలైన యాక్షన్ డ్రామా.
'పంచాయత్' డైరెక్టర్ విజన్.. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్
దేవుడిపై ఉన్న నమ్మకం, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం మధ్య జరిగే ఘర్షణను డైరెక్టర్ దీపక్ మిశ్రా చాలా పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. 'పంచాయత్' సిరీస్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న దీపక్ మిశ్రా.. ఈసారి భారీ కాన్వాస్‌పై ఈ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్‌ను డిజైన్ చేశారు.
టీవీఎఫ్ (TVF) ఫౌండర్ అరుణభ్ కుమార్ కథ అందించగా, బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. సునీల్ గ్రోవర్, శ్వేతా తివారీ, మనీష్ పాల్, అనూప్ సోని లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సిద్ధార్థ్‌తో నటించడం నా కల.. స్పందించిన తమన్నా
{{/usCountry}}టీవీఎఫ్ (TVF) ఫౌండర్ అరుణభ్ కుమార్ కథ అందించగా, బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. సునీల్ గ్రోవర్, శ్వేతా తివారీ, మనీష్ పాల్, అనూప్ సోని లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సిద్ధార్థ్‌తో నటించడం నా కల.. స్పందించిన తమన్నా
{{/usCountry}}ఇటీవల జరిగిన ఒక ప్రైమ్ వీడియో ఈవెంట్‌లో తమన్నా మాట్లాడుతూ సిద్ధార్థ్‌తో వర్క్ చేయడం తన డ్రీమ్ అని పంచుకున్నారు. "చిన్నప్పటి నుంచి నేను వింటూ పెరిగిన కథల్లాంటి ఒక స్ట్రాంగ్ సోల్ ఉన్న స్క్రిప్ట్ ఇది. సిద్ధార్థ్ చాలా గ్రేట్ యాక్టర్, ఆయనతో కలసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది" అని తమన్నా చెప్పుకొచ్చారు.
సిద్ధార్థ్ మల్హోత్రా గతంలో 'పరమ్ సుందరి' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' సినిమాతో సెప్టెంబర్ 25, 2026న థియేటర్లలో భారీగా విడుదల కానున్నారు.