Web Series Actress: సెక్స్ రాకెట్ కేసులో వెబ్ సిరీస్ నటి అరెస్ట్.. పోలీసులకు ఎలా దొరికిపోయిందంటే?

Web Series Actress: వెబ్ సిరీస్ నటి సెక్స్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన ఘటన కలకలం రేపుతోంది. హిందీ సిరీస్ లలో నటించే భోజ్‌పురి నటిని థానే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె పేరు, ఇతర వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

Published on: Sep 29, 2026, 16:25:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Web Series Actress: భోజ్‌పురి సినిమాలు, 10కి పైగా ప్రముఖ హిందీ వెబ్ సిరీస్‌లలో నటించిన ఒక వర్ధమాన నటి సెక్స్ రాకెట్ నడుపుతూ థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యభిచార దందాపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ (AHTC) అధికారులు పక్కా ప్లాన్‌తో దాడి చేసి ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు.

Web Series Actress: సెక్స్ రాకెట్ కేసులో వెబ్ సిరీస్ నటి అరెస్ట్.. పోలీసులకు ఎలా దొరికిపోయిందంటే?
Web Series Actress: సెక్స్ రాకెట్ కేసులో వెబ్ సిరీస్ నటి అరెస్ట్.. పోలీసులకు ఎలా దొరికిపోయిందంటే?

సినిమాలు, ఓటీటీ షోలలో అవకాశాలు ఇప్పిస్తామంటూ అమాయక మహిళలను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్.. పడ్వాల్ నగర్‌లో ట్రాప్

మహారాష్ట్రలోని థానే నగర పరిధిలో కొద్దిరోజులుగా రహస్యంగా ఒక హైప్రొఫైల్ వ్యభిచార రాకెట్ నడుస్తున్నట్లు ఏహెచ్‌టీసీ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అంజలి ఆంధలేకి ముందస్తు సమాచారం అందింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 26న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వాగ్లే ఎస్టేట్‌లోని పడ్వాల్ నగర్ ఏరియాలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

సదరు నటి ఇద్దరు అమాయక యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు చాకచక్యంగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇద్దరు అమాయక యువతుల రెస్క్యూ.. బీఎన్‌ఎస్ కింద ఎఫ్‌ఐఆర్

దాడి సమయంలో అక్కడ చిక్కుకున్న ఇద్దరు యువతులను పోలీసులు సురక్షితంగా కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నటిపై భారత న్యాయ సంహిత (BNS) చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు అనైతిక వ్యాపార నిరోధక చట్టం (ITPA) నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

అయితే కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండటం వల్ల, నెట్‌వర్క్‌లోని ఇతర వ్యక్తుల వివరాలు సేకరించేందుకు పోలీసులు సదరు నటి పేరును అధికారికంగా గోప్యంగా ఉంచారు.

గ్లామర్ వెనుక చీకటి సామ్రాజ్యం.. నెట్‌వర్క్ తీగ లాగుతున్న పోలీసులు

అరెస్ట్ అయిన నటికి భోజ్‌పురి ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అయిన 10కి పైగా పాపులర్ వెబ్ సిరీస్‌లలో ఆమె కీలక పాత్రలు పోషించింది. అవకాశాలు తగ్గడం వల్లే ఈజీ మనీ కోసం ఇలాంటి అక్రమ దందాలకు దిగిందా లేదా దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉందా అనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.

ఈ వ్యభిచార రాకెట్‌తో సంబంధం ఉన్న ఇతర ఏజెంట్లు, కస్టమర్ల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. త్వరలోనే ఈ కేసుకి సంబంధించి మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More