Virosh Premier League: విరోష్ ప్రీమియర్ లీగ్.. విజయ్, రష్మిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభం.. ఫొటోలు వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు (Wedding of VIROSH) మొదలయ్యాయి. ఇందులో భాగంగా విరోష్ ప్రీమియర్ లీడ్ అంటూ ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో జరిగిన వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఈ సెలబ్రిటీ కపుల్ షేర్ చేశారు.
టాలీవుడ్ స్టార్ నటీనటులు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల మధ్య వివాహం చేసుకోబోతున్నారు. కొన్ని రోజుల కిందట ఈ జంట అధికారికంగా తమ పెళ్లి ప్రకటన చేసి అభిమానులను ఎంతగానో సంతోషపెట్టారు. తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 24) తమ పెళ్లికి ముందు జరుగుతున్న సరదా ఆటలు, వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో పంచుకున్నారు.

విరోష్ ప్రీమియర్ లీగ్
రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'విరోష్ ప్రీమియర్ లీగ్' అని రాసి ఉన్న ఒక గ్రౌండ్ కి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. అందులో ఈ ఫన్ గేమ్స్ కోసం చాలా మంది బంధువులు, స్నేహితులు గుమిగూడి ఉన్నారు. అయితే ఆ ఫోటోలో వారి ముఖాలు మాత్రం స్పష్టంగా కనిపించలేదు.
మరోవైపు, విజయ్ దేవరకొండ కూడా ఇదే తరహాలో ఒక పోస్ట్ చేశాడు. అందులో 'విరోష్ ప్రీమియర్ లీగ్' అని రాసి ఉన్న ఒక పాప్‌కార్న్ బకెట్ ఫోటోను పంచుకున్నాడు.
ఇలా తమ అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆడుతున్న సరదా ఆటలకు సంబంధించిన చిన్న చిన్న గ్లింప్స్‌ను వారు అభిమానులతో పంచుకున్నారు. దీన్ని బట్టి ఈ జంట తమ పెళ్లి వేడుకను కేవలం తమకు ఇష్టమైన, అత్యంత ఆప్తుల మధ్య మాత్రమే ఎంతో ఏకాంతంగా జరుపుకుంటున్నారని స్పష్టమవుతోంది.
దీనికి ముందు విజయ్ ఒక పూల్‌సైడ్ దగ్గర జరిగిన ఒక సరదా గ్యాదరింగ్ కు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశాడు. అందులో స్విమ్మింగ్ పూల్ లో కొందరు వాలీబాల్ ఆడటం చూడొచ్చు. అదే సమయంలో రష్మిక కూడా ఒక అందమైన డిన్నర్ సెటప్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది.

విజయ్, రష్మిక ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనౌన్స్‌మెంట్
గత ఆదివారం (ఫిబ్రవరి 22) నాడు రష్మిక, విజయ్ తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో ఒక అందమైన నోట్ ద్వారా తమ వివాహాన్ని అధికారికంగా ధృవీకరించిన విషయం తెలిసిందే. ఆ నోట్‌లో వారు ఇలా రాసుకొచ్చారు.
"మా ప్రియమైన వారికి.. మేము మా కోసం ఎలాంటి ప్లాన్స్ చేసుకోకముందే, ఏదీ ఎంచుకోకముందే మీరు ఉన్నారు. ఎంతో ప్రేమతో మీరే మాకు ఒక పేరు పెట్టారు. మమ్మల్ని 'విరోష్' (VIROSH) అని పిలిచారు. కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా మా కలయికకు మీ గౌరవార్థం ఆ పేరే పెడుతున్నాము. మా పెళ్ళికి 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' అని పేరు పెట్టాలనుకుంటున్నాము. మమ్మల్ని ఇంతలా ప్రేమించినందుకు ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ మాలో ఒక భాగమే. బిగ్గెస్ట్ హగ్స్ అండ్ ఫుల్ లవ్" అని వారు ఆ ప్రకటనను ముగించారు.
గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల మధ్య రష్మిక, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం చాలా సైలెంట్‌గా జరిగింది. అక్టోబర్ 3న వారు ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వారు పెళ్లి పీటలెక్కనున్నారు. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’, 2019లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించినప్పటి నుంచే ఈ జంట ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


