Virosh Wedding: విరోష్ వెడ్డింగ్ షెడ్యూల్.. మెహందీ, హల్దీ, సంగీత్ ఎప్పుడో తెలుసా? ఓ లుక్కేయండి
Virosh Wedding: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సందడి జోరందుకుంది. ఈ నెల 26న ఉదయ్‌పూర్‌లో వీళ్ల వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు ఉండే హల్దీ, మెహందీ, సంగీత్ ఈవెంట్లు గ్రాండ్ గా చేసుకునేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వీటి షెడ్యూల్ పై ఓ లుక్కేయండి.
లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ముహూర్తం దగ్గరపడుతోంది. ఈ జంట ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుంది. ఇప్పుడు ఈ విరోష్ వెడ్డింగ్ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక, విజయ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ల షెడ్యూల్ పై ఓ లుక్కేయండి.

విరోష్ వెడ్డింగ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఏడడుగులు వేయబోతున్నారు. గురువారం పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే తమ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో కలిసి వీళ్లు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఐటీసీ మెమెంటోస్ హాటల్ లో జరగబోతున్న ఈ వెడ్డింగ్ హాట్ టాపిక్ గా మారింది. పెళ్లికి ముందు హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు.
ప్రి వెడ్డింగ్ ఈవెంట్స్
విరోష్ ప్రి వెడ్డింగ్ ఈవెంట్స్ ఈ రోజు (ఫిబ్రవరి 24) నుంచే స్టార్ట్ కాబోతున్నాయి. మంగళవారం మెహందీ ఈవెంట్ తో పెళ్లి వేడుకలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమవుతాయని ఇండియా టుడే తెలిపింది. ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ వేడుకలు జరగనున్నాయి. విరోష్ వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరగబోతుంది.
గ్రాండ్ గా
విరోష్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐటీసీ మెమెంటోస్ హోటల్ ఇందుకు ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ మెహందీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇక సంగీత్ ఈవెంట్ కోసం స్పెషల్ గా కొరియోగ్రాఫర్లను ఇక్కడి నుంచి ఉదయ్ పూర్ తీసుకెళ్లారని తెలుస్తోంది.
సంగీత్ లో భాగంగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రొమాంటిక్ సాంగ్స్ కు స్టేజీపై డ్యాన్స్ చేయనున్నారని సమాచారం.
సెక్యూరిటీ
విరోష్ పెళ్లి కోసం ఐటీసీ మెమెంటోస్, చుట్టుపక్కల పటిష్ఠమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పోలీసు విభాగంతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా గట్టిగానే ఉందని తెలిసింది. త్రీ టైర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారని సమాచారం. ఈ విరోష్ వెడ్డింగ్ కోసం హైదరాబాద్ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీని ఉదయ్ పూర్ తీసుకుని వెళ్లారని తెలిసింది.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫస్ట్ టైమ్ గీత గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఇది 2018లో రిలీజ్ అయింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీలో కలిసి కనిపించారు. ఈ చిత్రం 2019లో విడుదలైంది. ఇప్పుడు రణబాలి సినిమాలో నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


