ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ 'ఫోర్బ్స్' (Forbes) తాజాగా 2026 ఏడాదికి గాను ప్రపంచ బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 4000 మందికి పైగా డాలర్ బిలియనీర్లు చోటు దక్కించుకోగా.. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు తమ సత్తా చాటారు.

సాధారణంగా నిర్మాణ సంస్థల అధినేతలు, మ్యూజిక్ లేబుల్ ఓనర్లు ఈ జాబితాలో కనిపిస్తుంటారు. కానీ సినిమాల్లో ఒక్క మెయిన్ లీడ్ రోల్ కూడా చేయకుండానే, కేవలం టెలివిజన్ రంగంపై పట్టుతో ఒక నటి ప్రపంచంలోనే అత్యంత ధనిక నటిగా అవతరించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఎవరీ ప్రపంచ కుబేర నటి?
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం రియాలిటీ టీవీ స్టార్, నటి కిమ్ కర్దాషియాన్ (Kim Kardashian) 1.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 17 వేల కోట్లకు పైగా) నికర ఆస్తితో అగ్రస్థానంలో నిలిచింది. కిమ్ తన రియాలిటీ టీవీ పాపులారిటీని ఒక భారీ సామ్రాజ్యంగా మార్చుకున్నారని ఫోర్బ్స్ కొనియాడింది. 2000వ దశకం ప్రారంభంలో సెలబ్రిటీ సోషలైట్‌గా కెరీర్ ప్రారంభించిన కిమ్.. 'కీపింగ్ అప్ విత్ ద కర్దాషియాన్స్' రియాలిటీ షోతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది.
సినిమాల్లో ఆమె ప్రయాణం చిన్న పాత్రలతోనే మొదలైంది. 'డీప్ ఇన్ ది వ్యాలీ' వంటి చిన్న బడ్జెట్ చిత్రాల్లో, 'CSI: NY', '30 రాక్' వంటి పాపులర్ షోలలో అతిథి పాత్రల్లో కనిపించింది. అయితే ఇటీవలి కాలంలో ఆమె ప్రొఫెషనల్ యాక్టింగ్ పై దృష్టి సారించింది. 'అమెరికన్ హారర్ స్టోరీ', 'ఆల్స్ ఫెయిర్' వంటి సిరీస్‌లలో రెగ్యులర్ పాత్రలు చేయడంతో పాటు 'పా పెట్రోల్' సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది.
హాలీవుడ్, బాలీవుడ్ దిగ్గజాల కంటే ఎంతో ముందు..
కిమ్ కర్దాషియాన్ సంపాదించిన ఈ 1.9 బిలియన్ డాలర్ల ఆస్తి, ప్రపంచవ్యాప్తంగా పేరున్న దిగ్గజ నటుల ఆస్తుల కంటే చాలా ఎక్కువ. ఆమె ఎవరిని వెనక్కి నెట్టిందో ఇక్కడ చూడండి.
{{/usCountry}}కిమ్ కర్దాషియాన్ సంపాదించిన ఈ 1.9 బిలియన్ డాలర్ల ఆస్తి, ప్రపంచవ్యాప్తంగా పేరున్న దిగ్గజ నటుల ఆస్తుల కంటే చాలా ఎక్కువ. ఆమె ఎవరిని వెనక్కి నెట్టిందో ఇక్కడ చూడండి.
{{/usCountry}}ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్: $1.4 బిలియన్లు
షారుక్ ఖాన్: $900 మిలియన్లు
టామ్ క్రూజ్: $750 మిలియన్లు
టైలర్ పెర్రీ: $1.4 బిలియన్లు
జెర్రీ సీన్‌ఫెల్డ్: $1.1 బిలియన్లు
అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ధనిక వుమన్ మ్యూజిక్ ఆర్టిస్ట్ టేలర్ స్విఫ్ట్ ($1.2 బిలియన్లు) కూడా కిమ్ కంటే వెనుకే ఉండటం గమనార్హం. ఓవరాల్ గా టాప్ 5లో షారుక్ ఖాన్ చోటు సంపాదించాడు. అతడు ఐదో స్థానంలో ఉన్నాడు.
ఈ భారీ సంపదకు మూలం ఏమిటి?
నటన అనేది కిమ్ ప్రస్థానంలో ఒక భాగం మాత్రమే. ఆమె అసలు సంపద అంతా తన వ్యాపారాల నుంచే వస్తోంది. ముఖ్యంగా ఆమెకు చెందిన షేప్‌వేర్ బ్రాండ్ 'Skims' ఈ విజయానికి ప్రధాన కారణం. 2025 నాటికి ఈ బ్రాండ్ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
కేవలం ఆన్‌లైన్‌లో మొదలైన ఈ వ్యాపారం, ఇప్పుడు అమెరికా, మెక్సికోలలో 20కి పైగా ఫిజికల్ స్టోర్లను కలిగి ఉంది. వీటితో పాటు 'SKKN By Kim' అనే బ్యూటీ బ్రాండ్ కూడా ఆమె ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తానికి వెండితెరపై సూపర్ స్టార్ ఇమేజ్ లేకపోయినా.. తనదైన బిజినెస్ మోడల్ తో కిమ్ కర్దాషియాన్ గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగింది.