Yash Ramayana: పదే పదే రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని అందుకే చెబుతున్నాం.. మీరూ బ్రిటీషర్లలా చేయకండి: రామాయణ మూవీపై యశ్
Yash Ramayana: రామాయణ మూవీ బడ్జెట్ గురించి యశ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ బడ్జెట్ రూ.4 వేలు కోట్లు అని పదేపదే చెప్పడానికి ఓ బలమైన కారణమే ఉందని చెప్పడం గమనార్హం. మరి అదేంటో చూడండి.
Yash Ramayana: ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'రామాయణం' (Ramayana) బడ్జెట్ పై వస్తున్న విమర్శలకు రాకింగ్ స్టార్ యశ్ గట్టిగా స్పందించారు. నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రెండు భాగాల భారీ చిత్రంలో యశ్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అక్టోబర్ 15న బెంగళూరులో జరిగిన రామాయణ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో యశ్ మాట్లాడుతూ.. సినిమాపై జరుగుతున్న చర్చలు, ముఖ్యంగా 4000 కోట్ల భారీ బడ్జెట్ గురించి వస్తున్న ట్రోల్స్‌కు పవర్ ఫుల్ ఆన్సర్ ఇచ్చారు. విదేశీ మార్కెట్లో మన సినిమాల స్థాయిని చాటి చెప్పాలంటే మనం పెట్టిన పెట్టుబడి గురించి గర్వంగా మాట్లాడాలని ఆయన తేల్చిచెప్పారు.
చిన్న బడ్జెట్ అని చెబితే విదేశాల్లో పట్టించుకోరు
చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా (Namit Malhotra) ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ సుమారు 4000 కోట్లుగా ఉంటుందని వెల్లడించినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. దీనిపై యశ్ స్పందిస్తూ.. "నమిత్ ఈ భారీ ఫిగర్ గురించి మాట్లాడినప్పటి నుంచి జనాలు ఆ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. మన దేశంలో ఇదే పెద్ద సమస్య. విదేశాలకు వెళ్లి మన సినిమాను ప్రమోట్ చేసేటప్పుడు, ఇది తక్కువ బడ్జెట్ సినిమా అని చెబితే వారు దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వరు. మనం ఎంత పెట్టుబడి పెట్టామో, మన దేశం ఏం చేయగలదో ప్రపంచానికి గర్వంగా చాటి చెప్పాలి" అని అన్నారు.
అంతేకాకుండా ఈ 4000 కోట్ల బడ్జెట్ కేవలం మొదటి సినిమాకు మాత్రమే కాదని, రెండు భాగాలకు సంబంధించిన ప్రొడక్షన్, ప్రమోషన్స్, గ్లోబల్ రిలీజ్ ఖర్చులు అన్నీ కలిపి అని ఆయన స్పష్టతనిచ్చారు.
బ్రిటీషర్ల తరహాలో విడగొట్టకండి
ఇదే వేదికపై నెటిజన్లను ఉద్దేశించి యశ్ మాట్లాడుతూ.. "ఎవరైనా మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తారు. కానీ మీరు కూడా బ్రిటీషర్లలాగా విడగొట్టి పాలించే విధానాన్ని ఫాలో కావద్దని నేను కోరుతున్నాను. ఈ సినిమాను సక్సెస్ చేయడానికి అందరం కలిసి రావాలి. ముఖ్యంగా కర్ణాటక ప్రజలు కుటుంబ సమేతంగా థియేటర్లలో ఈ దృశ్యకావ్యాన్ని చూడాలని మనసారా కోరుకుంటున్నాను" అని పిలుపునిచ్చారు.
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమా మొదటి భాగం 2026 నవంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా రిలీజ్ కానుంది.
ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు ట్రైలర్లు రిలీజ్ కాగా.. రెండింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ విజువల్ వండర్ భారీ స్కేల్, బీజీఎం, రావణుడిగా యశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరి ఈ మధ్యే టాక్సిక్ తో దారుణంగా బోల్తా పడిన యశ్.. ఈ రామాయణంతో ఏం చేస్తాడో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


